ఆ దర్శకుడు ఒక రాత్రి ఐదుగురు అమ్మాయిలతో గడిపాడు: సీనియర్‌ డైరెక్టర్‌ సంచలనం

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వంశీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సితార, అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల లాంటి చిత్రాలను మనం ఎప్పటీకీ మర్చిపోలేము. తక్కువ బడ్జెట్ లో గోదావరీ ప్రాంతాల్లో చిత్రాలు తీసి సూపర్ హిట్స్ కొట్టడం ఆయన స్పెషల్. అంతేకాక ఆయన చిత్రాల్లో కామెడీ, సంగీతానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. వంశీ సినిమాల్లో పాటలు అంటే సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ అని పేరుంది. అయితే ఇటీవల వంశీ దర్శకుడిగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్నారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు డైరెక్టర్ వంశీ. బ్యాంకాక్ లో జరిగిన ఓ షాకింగ్ ఘటనను వివరించారు. 'సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్ ఉంటుందని చాలామంది భావిస్తుంటారు.. అందులో కొంత నిజం ఉంది.. మరికొంత అబద్ధం ఉంటుంది. అలాగే హీరోయిన్ డైరెక్టర్ల మధ్య కూడా ఎఫైర్లు ఉంటాయని అనుకుంటారు. అందులోనూ 50 శాతం నిజం ఉంది' అని చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది ఆ రిలేషన్ కంటిన్యూ చేస్తారని మరికొంతమంది సినిమా వరకే పరిమితం చేస్తారన్నారు.

Sensational Allegations Director Vamsi Reveals Shocking Details About a Tollywood Filmmaker in Bangkok

అయితే సినిమా సిట్టింగులకోసం ఓ సారి బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఓ షాకింగ్ సంఘటన వంశీ దృష్టికి వచ్చిందట. 'ఒక హీరోను కలవడానికి కొందరు రైటర్స్ తోపాటు బ్యాంకాక్‌ వెళ్లాల్సి వచ్చింది. నాతో పాటు వచ్చిన ఒక యంగ్‌ రైటర్‌ ఒక రూమ్‌ చూపించాడు. ఈ రూమ్‌లో టాలీవుడ్ కు చెందిన ఫలానా దర్శకుడు ఒక రాత్రి ఐదుగురు అమ్మాయిలతో గడిపాడు. అని చెప్పాడు. అతని మాటలకు నేను షాక్ కు గురయ్యాను' అని తెలిపారు. ఇక సీనియర్ హీరోయిన్ భానుప్రియతో వంశీకు ఎఫైర్ ఉందన్న వార్తలూ చాలాసార్లు బయటకు వచ్చాయి. అయితే వాటిని ఆయన మరోసారి కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని అన్నారు.

Take a Poll

ఇక వంశీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. 1982లో 'మంచు పల్లకి' సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత 'సితార' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. ఆ తర్వాత 'అన్వేషణ', 'ప్రేమించు పెళ్లాడు', 'ఆలాపన', 'లేడీస్‌ టైలర్‌', 'మహర్షి', 'చెట్టు కింద ప్లీడర్‌', 'ఏప్రిల్ 1 విడుదల', 'డిటెక్టీవ్‌ నారద', 'జోకర్‌', 'ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు' వంటి చిత్రాలను రూపొందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+