విజయ్ 'జన నాయగన్' విడుదల వాయిదా..?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి మూవీ జన నాయగన్.. సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మూవీని సెన్సార్ గండం వెంటాడుతోంది. విడుదలకు ఇంకా రెండు రోజులే గడువు ఉన్నా సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఈ మేరకు జన నాయగన్ మూవీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తక్షణమే సర్టిఫికెట్ జారే చేసేలా సెన్సార్ బోర్డ్ కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది.
అంతకుముందు CBFC బోర్డు నుంచి.. ఈ సినిమా మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని, సాయుధ దళాలను అభ్యంతరకరమైన రీతిలో చిత్రీకరించిందని ఆరోపిస్తూ నిర్మాతలకు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ పీటీ షా ధర్మాసనం తీర్పును జనవరి 9కు రిజర్వ్ చేసింది. మరోవైపు అదే రోజు మూవీ విడుదల కావాల్సి ఉన్న నేపథ్యంలో మూవీ రిలీజ్ లో జాప్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఈ పరిణామాలపై విజయ్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయ్ చివరి సినిమా విషయంలో ఇలా జరగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తమ హీరోను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామాల వెనుక రాజకీయ కుట్ర ఉందని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో .. తమిళంలో జన నాయగన్ మూవీ జనవరి 9న విడుదల సందేహంగానే ఉంది. అలాగే అదే రోజు తెలుగు, హిందీ వెర్షన్స్ విడుదలకు కూడా అవకాశం లేనట్లేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో జనవరి 9 న ప్రభాస్ రాజాసాబ్ మూవీకి అటు తెలుగు రాష్ట్రాలతోపాటుగా తమిళం, హిందీలో సోలో రిలీజ్ దొరికినట్టుగానే భావించాలి.

ఇక ఈ సంక్రాంతికి చాలా సినిమాలే రిలీజ్ కు రెడీ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాజాసాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'.. అలాగే మాస్ మహారాజ రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీనారీ నడుమ మురారీ' చిత్రాలు కూడా పండక్కే రిలీజ్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications