ఒకరు కాదు.. నా లైఫ్‌లో చాలామంది పార్ట్‌నర్లు ఉన్నారు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ నటి షహానా గోస్వామి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకుంది. 'రాక్ ఆన్', 'ఫిరాక్', 'హీరోయిన్', 'మిడ్‌నైట్ చిల్డ్రన్', 'జ్వీగాటో', 'సంతోష్' వంటి పలు అద్భుతమైన చిత్రాలలో నటించి ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా సిద్ధార్థ్ కనన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షహానా గోస్వామి తన వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాలపై చేసిన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తనకంటే 21 ఏళ్లు పెద్దవాడైన మోడల్, నటుడు మిలింద్ సోమన్‌తో సాగించిన ప్రేమాయణం గురించి ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తనకు 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, తనకంటే 21 ఏళ్లు పెద్దవాడైన మిలింద్ సోమన్‌తో ప్రేమలో పడ్డానని షహానా గోస్వామి వెల్లడించారు. వీరిద్దరూ దాదాపు 4 నుంచి 5 ఏళ్ల పాటు డేటింగ్ చేశారని, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారని ఆమె వెల్లడించారు. తనకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మిలింద్ సోమన్ నటించిన ఓ సినిమా చూశానని, మొదట్లో ఓ మోడల్ నటించిన సినిమా కాబట్టి పెద్దగా బాగోదేమో అనుకున్నానని, కానీ ఆ సినిమా చూశాక తాను అతనికి వీరాభిమానిగా మారిపోయానని షహానా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో అతనికి ఉత్తరాలు రాయడం కోసం ఇంటర్నెట్‌లో అడ్రస్ వెతుకుతుండగాయయ యాదృచ్ఛికంగా మిలింద్ ల్యాండ్‌లైన్ నంబర్ దొరికిందని ఆమె చెప్పారు.

ఆ తర్వాత తన తండ్రి కొనిచ్చిన ఫోన్ నుంచి మిలింద్ సోమన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ చేశానని, దానికి అతను వెంటనే స్పందించాడని షహానా గోస్వామి తెలిపారు. అలా ఇద్దరం దాదాపు ఆరేళ్ల పాటు కేవలం మెసేజ్‌ల ద్వారానే మాట్లాడుకున్నామని, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం తాను ముంబై వచ్చినట్లు పేర్కొన్నారు. ముంబై వచ్చాక ఆరేళ్ల తర్వాత ఇద్దరూ కలవాలని నిర్ణయించుకున్నామని, ఆ సమయంలో తామిద్దరం సింగిల్‌గానే ఉన్నామని ఆమె చెప్పారు. కలిసిన కేవలం 4 రోజుల్లోనే ఇద్దరం డేటింగ్ ప్రారంభించామని, తమ మధ్య ఉన్న వయసు వ్యత్యాసం ఎప్పుడూ తమ బంధానికి అడ్డు రాలేదని, ఎందుకంటే ఆ వయసులోనే తాను చాలా మెచ్యూరిటీతో ఆలోచించేదాన్నని ఆమె వివరించారు.
మిలింద్ సోమన్‌తో బ్రేకప్ కావడానికి గల కారణాలను కూడా షహానా గోస్వామి ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తామిద్దరి ఆలోచనలు, వ్యక్తిత్వాలు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండటం వల్లే విడిపోవాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఒకరిని బంధించి ఉంచడం ప్రేమ కాదని, అవతలి వ్యక్తికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే నిజమైన ప్రేమ అని తాను నమ్ముతానని ఆమె అన్నారు. మిలింద్‌తో విడిపోయినప్పటికీ.. అతని వల్ల తనకు పిల్లులంటే ఇష్టం ఏర్పడిందని, ఆ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.
ఇక తన ప్రస్తుత లవ్ లైఫ్ గురించి మాట్లాడుతూ షహానా గోస్వామి మరికొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. తన జీవితంలో ఒకరు కాదు, చాలామంది పార్ట్‌నర్లు ఉన్నారని ఆమె ఓపెన్‌గా ప్రకటించారు. అయితే తన జీవితంలో ఏ బంధం కూడా టైంపాస్ కోసం ఏర్పడింది కాదని ఆమె అన్నారు. "నా దృష్టిలో ఓపెన్ రిలేషన్‌షిప్ అనేది ఒక మంచి స్నేహం లాంటిది. అది కొన్నిసార్లు కేవలం స్నేహంగానే మిగిలిపోవచ్చు, మరికొన్నిసార్లు శారీరక బంధంగా మారవచ్చు, లేదా కేవలం ఒకరికొకరు మానసిక ప్రశాంతతను ఇచ్చే ఎమోషనల్ బాండ్‌గా మాత్రమే ఉండవచ్చు" అంటూ బంధాలపై తనకున్న భిన్నమైన అభిప్రాయాన్ని షహానా గోస్వామి నిర్మొహమాటంగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications