ఓటీటీలో కూడా స్మాషింగ్ హిట్: 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్..!!
ఆది సాయికుమార్ నటించిన 'శంబాల' చిత్రం ఓటీటీలో కూడా భారీ విజయం సాధించింది. వ్యూస్ లల్లో అదరగొడుతోంది. ఈ మిస్టిక్ థ్రిల్లర్.. ఓటీటీలో విడుదల అయిన జస్ట్ అయిదే అయిదు రోజుల్లో 60 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలు దాటింది. 100 మిలియన్ల మైలురాయిని అధిగమిండానికి రెడీ అవుతోంది. యంగ్ అండ్ డైనమిక్ హీరోగా ఆది సాయికుమార్ కు ఉన్న క్రేజ్ పెరుగుతోందనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
'శంభాల' బాక్సాఫీస్ వద్ద కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. దశాబ్దకాలం తర్వాత ఆది సాయికుమార్ కు సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. అతని కేరీర్ ను మరో పదేళ్ల పాటు నిలబెట్టిందీ మూవీ. పబ్లిసిటీ ఖర్చులను కలుపుకొని మొత్తం 10 కోట్ల రూపాయలతో తెరకెక్కిన శంబాల.. నిర్మాతలకు కాసుల పంట పండించింది. రెట్టింపు లాభాలను ఆర్జించిపెట్టింది. బాక్సాఫీస్ ట్రాకింగ్ పోర్టల్ Sacnilk వెల్లడించిన వివరాల ప్రకారం ఈ చిత్రం 25 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఓటీటీలో విడుదల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు సినిమా థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ చిత్రానికి అంచనాలకు మించిన ప్రేక్షకాదరణ, థియేట్రికల్ రన్ లభించిందని స్పష్టమౌతోంది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఆదరిస్తారని 'శంబాల' నిరూపించింది. 10 కోట్ల రూపాయలకు ఆహా ప్లాట్ ఫామ్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఆది సాయికుమార్ కేరీర్ లోనే అత్యధికం.
దర్శకుడు యుగంధర్ ముని లో- బడ్జెట్‌లో తో తెరకెక్కించినా తన కథనం, నాన్‌స్టాప్ థ్రిల్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చాక, చిత్రంపై ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా కథాంశం, ద్వితీయార్థంలోని థ్రిల్స్‌ను ప్రశంసిస్తున్నారు. ఆకాశం నుండి దిగొచ్చే ఒక దుష్టశక్తి గ్రామాన్ని పీడిస్తుండగా, శాస్త్రవేత్త అయిన ఆది సాయికుమార్ దాన్ని ఎలా కాపాడాడు అనేది ఈ చిత్రం కథ. అర్చన అయ్యర్ ఇందులో కథానాయికగా నటించారు.












Click it and Unblock the Notifications