హీరో శర్వానంద్ విడాకులు..!
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. తెలుగులో కూడా చాలామంది సెలబ్రిటీలు తమ లైఫ్ పార్టనర్‌లకు విడాకులిచ్చారు.
చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, నాగార్జున కొడుకు నాగచైతన్య, మోహన్ బాబు కొడుకు మనోజ్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య , పవన్ కళ్యాణ్ వంటి వారు విడాకులు తీసుకున్న వారి జాబితాలో ఉన్నారు. తాజాగా హీరో శర్వానంద్ కూడా విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త విని అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గతేడాది శర్వానంద్ రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమే. ఈ దంపతులు పెళ్లైన ఏడాదిలోపే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరు విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటని అభిమానులు ఆరా తీస్తున్నారు.శర్వానంద్ జంట అప్పుడే విడాకులు తీసుకొని విడిపోవడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు. అయితే తర్వాత కానీ అసలు విషయం తెలియలేదు. శర్వానంద్ విడాకులు తీసుకుంటుంది నిజ జీవతంలో కాదు, సినిమాలో అని తర్వాత బయటపడింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా మారారు.
ఈ క్రమంలోనే సామజ వరగమన సినిమా దర్శకుడు అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమాకి కమిట్ అయ్యారు.అయితే ఈ సినిమా విడాకుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరూ విడిపోవాల్సి రావడంతో విడాకుల కోసం తిరిగే కథలో శర్వానంద్ నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్యలు హీరోయిన్స్‌గా చేస్తున్నారు. విడాకుల కాన్సెప్ట్‌తో శర్వానంద్ సినిమా తెరకెక్కుతోంది.












Click it and Unblock the Notifications