చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్‌తో రొమాన్స్ చేసిన ఏకైక తెలుగు హీరోయిన్
ప్రతి నాయకుడిగా, చిన్న చిన్న క్యారెక్టర్లతో సినీ పరిశ్రమలో కెరీర్ ను ప్రారంభించిన చిరంజీవి తన డ్యాన్సులు, ఫైట్లతో అగ్ర కథానాయకుడి స్థాయికి చేరుకున్నారు.
ఆయన పరిశ్రమలో బాగా స్థిరపడిన తర్వాత తన కుటుంబం నుంచి ఒక్కొక్కరిని హీరోలుగా వెండితెరకు పరిచయం చేయడం మొదలుపెట్టారు. సోదరుడు నాగబాబు చిన్న చిన్న క్యారెక్టర్లలోనే రాణించారు. మరో సోదరుడు పవన్ కల్యాణ్ ను తీసుకురాగా ఆయన పవర్ స్టార్ అవడంతోపాటు ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. స్టార్ హీరో హోదా వచ్చింది. తర్వాత తన కుమారుడు రామ్ చరణ్ ను పరిచయం చేయగా తను కూడా స్టార్ హీరోగా అవతరించారు. వీరే కాకుండా మేనళ్లుల్లు అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కథానాయకులుగా కొనసాగుతున్నారు. మధ్యలో ఒకరిద్దరు అల్లుళ్లు ఒకటి రెండు సినిమాలు చేశారు.
ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మగధీర
రాజకీయాలు వద్దనుకొని రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత చిరు ఖైదీ నెంబరు 150 సినిమాను వినాయక్ దర్శకత్వంలో చేశారు. అందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి హిట్ అయింది. కాజల్ అగర్వాల్ ఒక్క చిరంజీవితోనేకాదు పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తో కూడా కలిసి నటించి ఔరా అనిపించింది ఈ బ్యూటీ. ముగ్గురు మెగా హీరోలతో నటించడం అంటే సాధారణ విషయం కాదు. పవన్ కల్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసింది. దీనికి బాబీ దర్శకుడు. సినిమా డిజాస్టర్ గా నిలిచింది. రామ్ చరణ్ తో మూడు సినిమాలు చేసింది. మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే చేయగా మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలవగా, నాయక్ సూపర్ హిట్ అయింది. గోవిందుడు అందరివాడేలే సినిమా మాత్రం డిజాస్టర్ అయింది.

అరుదైన రికార్డును నెలకొల్పిన కాజల్
ఇలా మెగా కుటుంబంలో ముగ్గురు హీరోలతో కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేసి అరుదైన రికార్డును నెలకొల్పింది. వివాహమైన తర్వాత కూడా వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండటంతో సినిమాలు చేస్తోంది. ఎవడు సినిమాలో అల్లు అర్జున్ ప్రేయసిగా నటించింది. అలాగే ఆర్య2లో కూడా నటించింది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు కాజల్ అగర్వాల్ మంచి ఆప్షన్ గా కనపడుతోంది. తెలుగులో సినియర్ హీరోలకు హీరోయిన్ల కొరత వెంటాడుతోంది. ఇటీవలే బాలయ్య సరసన భగవంత్ కేసరి చిత్రంలో నటించింది.












Click it and Unblock the Notifications