'కనపడకుండా పోతావ్ అని వార్నింగ్ ఇచ్చారు'

అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, లిటిల్ హార్ట్స్ మూవీస్ తో యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న బ్యూటీ శివానీ నగరం. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ హే భగవాన్ మూవీ ఫిబ్రవరి 20 న రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుహాస్ సరసన హీరోయిన్ గా నటించింది శివానీ. ఇటీవల రిలీజైన హే భగవాన్ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీకి గోపీ అచ్చర దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది శివానీ నగరం.

లిటిల్ హార్ట్స్ మూవీలో కాత్యాయని పాత్రలో అందరినీ కడుపుబ్బా నవ్వించింది శివానీ నగరం. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజైన ఈ మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దాంతో ఈ మూవీలో నటించిన మౌళి, శివానీ కు మంచి గుర్తింపు లభించింది. అయితే శివానీ.. అంతకుముందు అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీలో నటించింది. ఈ మూవీలో సుహాస్ సరసన హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు హే భగవాన్ చిత్రంలో మరోసారి సుహాస్ తో జతకట్టింది శివానీ.

ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాలను వెల్లడించింది శివానీ. తనకు 100 సినిమాల్లో నటించాలని లేదని.. చేసిన ఐదు సినిమాలైనా తనకు గుర్తింపును తీసుకొచ్చేవిగా ఉండాలని.. ఈ అమ్మాయి ఏంటి అన్ని హిట్ సినిమాలే చేస్తుంది.. అని పేరు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. తాను తెలుగు అమ్మాయినే అని తెలిపింది. సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లు ఏమాత్రం అడ్డు చెప్పకుండా సపోర్ట్ చేశారని పేర్కొంది. అయితే వరుసగా సినిమాలు చేయకపోతే కనిపించకుండా పోతావు.. అని ఇండస్ట్రీలో కొంతమంది వార్నింగ్ ఇచ్చారని.. కానీ తాను మాత్రం ఎంపిక చేసుకునే సినిమాలు చేస్తున్నట్లు తెలిపింది శివానీ.

ShivaniNagaram Series of Films or Fade Away Young Heroine s Honest Industry Reality Check

ఇక హే భగవాన్ మూవీ చాలా సరదాగా సాగిపోతుందని.. నరేష్‌, వెన్నెల కిశోర్‌ పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయని శివానీ నగరం పేర్కొంది. గోపీ అచ్చర దర్శకత్వంలో సుహాస్‌, శివానీ జంటగా నటించిన హే భగవాన్ మూవీకి బి నరేంద్ర రెడ్డి నిర్మాత కాగా ఈమూవీ ఫిబ్రవరి 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+