Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌పై షాకింగ్ ఆరోపణలు.. ప్రముఖ నటి సంచలనం!

National Film Awards: భారత చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ చలనచిత్ర పురస్కారాలు(National Film Awards) పారదర్శకతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. ఇటీవల 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన జరిగిన నేపథ్యంలో 80వ దశకపు ప్రముఖ నటి ప్రముఖ నటి మౌషుమి ఛటర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డులను డబ్బుకు బదులుగా ఇస్తారని ఆమె పేర్కొనడం సినీ వర్గాల్లో కలకలం రేపింది.

ఆగస్టు 1న, 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. ఈ సారి షారుఖ్ ఖాన్‌కు 'జవాన్' సినిమాకు ఉత్తమ నటుడిగా, విక్రాంత్ మాస్సేకు '12th ఫెయిల్' సినిమాకు అవార్డు లభించింది. అలాగే రాణి ముఖర్జీకి 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. ఈ ఉత్సవ వాతావరణంలోనే మౌషుమి ఛటర్జీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Shocking Allegations on National Film Awards Actress Moushumi Chatterjee s Big Revelation

మౌషుమి ఛటర్జీ సంచలన ఆరోపణల వెనుక..
70-80వ దశకంలో తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన మౌషుమి ఛటర్జీ, బాలనటిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 'లహరే రెట్రో'కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె జాతీయ అవార్డుల గురించి మాట్లాడుతూ.. తనకు ఒకసారి కాదు, రెండుసార్లు డబ్బుకు బదులుగా అవార్డులను ఆఫర్ చేశారని వెల్లడించారు. ఈ ఆఫర్లను తాను తిరస్కరించినట్లు ఆమె స్పష్టం చేశారు. ఆమె తన సినిమాలు 'అనురాగ్', 'రోటీ కపడా ఔర్ మకాన్' కోసం తనకు అవార్డుల ఆఫర్ వచ్చిందని తెలిపారు. అయితే, తాను ఎటువంటి అవార్డుల కోసం డబ్బులు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పానని మౌషుమి ఛటర్జీ వెల్లడించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అవార్డుల ఎంపిక ప్రక్రియపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

రిషి కపూర్, కిషోర్ కుమార్‌పైనా ఆరోపణలు
మౌషుమి ఛటర్జీ తన సంచలన ఆరోపణలను ఇక్కడితో ఆపలేదు. అదే సంభాషణలో ఆమె మరో కీలక విషయాన్ని బయటపెట్టారు.'బాబీ' సినిమా కోసం దివంగత నటుడు రిషి కపూర్ డబ్బులు ఇచ్చి అవార్డులు కొనుక్కున్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయం రిషి కపూర్ ఆత్మకథ "ఖుల్లమ్-ఖుల్లమ్"లో కూడా ప్రస్తావించబడిందని ఆమె గుర్తు చేశారు. రిషి కపూర్ స్వయంగా తన పుస్తకంలో, తాను ఒక పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) వ్యక్తి ద్వారా 30 వేల రూపాయలు ఇచ్చి అవార్డు కొన్నానని, ఆ తర్వాత దానికి చాలా పశ్చాత్తాపపడ్డానని రాసుకున్నారు. రిషి కపూర్, మౌషుమి ఛటర్జీలే కాకుండా, గాయకుడు కిషోర్ కుమార్‌కు కూడా డబ్బుకు బదులుగా అవార్డు ఆఫర్ చేశారని తెలుస్తోంది. విక్కీ లాల్వానీతో ఒక ఇంటర్వ్యూలో కిషోర్ కుమార్ కుమారుడు ఈ విషయాన్ని వెల్లడించారు.

జాతీయ అవార్డుల ప్రాముఖ్యత.. వివాదం
దేశంలో అత్యున్నత గౌరవాలలో ఒకటిగా పరిగణించబడే జాతీయ చలనచిత్ర పురస్కారాలు, సినీ ప్రపంచంలోని కళాకారులకు వారి ఉత్తమ పనితీరుకు గుర్తింపుగా అందజేస్తారు. అయితే, ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులపై డబ్బు లావాదేవీల ఆరోపణలు రావడం సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది అవార్డుల కమిటీ పారదర్శకత, ఎంపిక ప్రక్రియ విశ్వసనీయతపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఆరోపణలపై అధికారికంగా ఎటువంటి స్పందనా రాలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+