పబ్లిక్‌గా బీర్ కొడుతూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్ తన అద్భుతమైన నటనతో, గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ ఇటీవలే 'కలియుగం 2064' అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. భవిష్యత్తులో జరిగే మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో మానవ మనుగడ కోసం సాగే ఈ చిత్రం సింప్లీ సౌత్ ఓటీటీలో విడుదలైంది. ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు.
శ్రద్ధా శ్రీనాథ్ నాని నటించిన 'జెర్సీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మలయాళంలో 2015లో వచ్చిన 'కోహినూర్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. 'ముంగారు మేల్ 2', 'ఉర్వి', 'కాట్రు వెళియిదై', 'ఇవన్ తంతిరాన్', 'విక్రమ్ వేద', 'రిచి', 'కృష్ణ అండ్ హిజ్ లీలా', 'డియర్ విక్రమ్', 'విట్నెస్', 'ఇరుగపాట్రు', 'మెకానిక్ రాకీ', 'డాకు మహారాజ్' వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. 2016లో విడుదలైన కన్నడ చిత్రం **'యూ టర్న్'**కు గాను ఆమె ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, శ్రద్ధా శ్రీనాథ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా తన వ్యక్తిగత విషయాలతో పాటు,సినిమా విశేషాలను సైతం అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల మాల్దీవ్స్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ బికినీలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. బికినీ షోతో అభిమానులకు గట్టిగానే గ్లామర్ ట్రీట్ అందించింది. అందులో ఓ ఫొటోలో అమ్మడు బీర్ తాగుతున్నట్టు కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications