ఆ సినిమా పెద్ద హిట్టవుతుందనుకున్నా.. ఎమోషనల్ అయిన పవన్ కల్యాణ్ హీరోయిన్
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హిట్ లు, ప్లాఫ్ లు సహజం. ఒక్కోసారి భారీ హిట్ అవుతుంది అనుకున్నా సినిమాలు కూడా ప్లాఫ్ లు అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే కోలీవుడ్ బ్యూటీ.. తొలి సినిమాతోనే తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన నటి శ్రుతి హాసన్. కమల్ హాసన్ కుమార్తె గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగులో తొలిసారి నటించిన సినిమా గబ్బర్ సింగ్. ఈ మూవీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఆడిపాడింది. దీంతో తొలి మూవీతోనే ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకుందీ బ్యూటీ. ఆ తర్వాత మహేశ్ బాబు శ్రీ మంతుడుతోనూ సూపర్ హిట్ అందుకుంది.
అయితే తాజాగా రజనీ కాంత్ కూలీ చిత్రంలోనూ అమ్మడు నటిస్తోంది. అయితే ఇటీవల ఆమె ఓ సినిమా విషయంలో ఎమోషనల్ అయింది. తన కెరీర్ లోని ఒక సినిమా పరాజయం గురించి శ్రుతి హాసన్ తన బాధను వ్యక్తం చేసింది. ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆమె ఆశించింది కానీ, అది నిరాశపరిచింది అని తెలిపింది. ప్రతి సినిమాకు దాదాపు వెయ్యి మంది పని చేస్తుంటారు. తీరా ఆ మూవీ హిట్ కాకపోతే దాన్ని తట్టుకోవడం కష్టం అని పేర్కొంది. ఈ మేరకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది.

"3 సినిమా కమర్షియల్ గా విజయం సాధించి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఇప్పుడంటే పాన్ ఇండియా హవా నడుస్తోంది. మరోవైపు ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అప్పుడు ఇవేమీ లేవు. 3 సినిమా హిందీలోకి డబ్ చేశాం. కానీ హిట్ కాలేదు. ఆ మూవీ ఇప్పుడు రిలీజై ఉంటే కొలవెరి సాంగ్ కంటే కూడా 3 చిత్రమే పెద్ద హిట్ అయ్యేది. అలా కొన్ని చిత్రాలు ఎంతో కష్టపడి చేసినా రిజల్ట్ మాత్రం రివర్స్ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక శ్రుతి హాసన్ ప్రస్తుతం కూలీ మూవీ చేస్తోంది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ తదితరులు నటించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించగా అనిరుధ్ సంగీతం అందించాడు.












Click it and Unblock the Notifications