మైక్ ఉందని ఏదిపడితే అది మాట్లాడొద్దు.. స్ట్రాంగ్ వార్నింగ్ !
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సైడ్ క్యారెక్టర్ లతో సినిమా కెరీర్ ప్రారంభించిన సిద్దు.. హీరోగా మారి తనదైన శైలిలో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 'డీజే టిల్లు' మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని డీజే టిల్లు 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గానే జాక్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సిద్దు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు.
ప్రస్తుతం సిద్ధు హీరోగా నటించిన 'తెలుసు కదా' సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నీరజ కోనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ చిత్రంపై ఆడియన్స్ లో భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై ఇప్పుడు వివాదం చెలరేగింది.

ఒక లేడీ రిపోర్టర్ "రియల్ లైఫ్‌లో మీరు ఉమనైజరా?" అని సిద్ధుని ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. ఇందుకు గాను లేటెస్ట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ లో సిద్ధు రియాక్ట్ అయ్యారు. చేతిలో మైక్ ఉంది కదా అని ఏదిపడితే అది మాట్లాడడం సరికాదని అన్నారు. ఆ సమయంలో ఎలా స్పందించాలో తనకు అర్థం కాలేదని.. అలా మాట్లాడటం చాలా డిస్ రెస్పెక్ట్‌ఫుల్ అంటూ చెప్పుకొచ్చారు. ఆమె అన్న మాట తనకు వినిపించింది కానీ.. అప్పుడు పట్టించుకోలేదని.. అటువంటి ప్రశ్నలు అడగకూడదని తమకు తామే తెలుసుకోవాలన్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం అదే లేడీ రిపోర్టర్.. డ్యూడ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన సమయంలో.. మీరు లుక్ పరంగా హీరో మెటీరియల్ కాదు. కానీ రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిదంటే అది మీ హార్డ్ వర్కా.. లేక అదృష్టమా? అని ఆమె ప్రశ్నించారు. దానికి ఏం సమాధానం చెప్పాలా ప్రదీప్ రంగనాథన్ ఆలోచిస్తుండగా పక్కనే ఉన్న శరత్‌కుమార్ మైక్ అందుకుని సమాధానం ఇచ్చారు.
అదే జర్నలిస్టు ప్రదీష్ ఇష్యూ గురించి స్పందించాలని కిరణ్‌ని అడిగారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. . మీరు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోని కించపరుస్తూ అలాంటి ప్రశ్న వేయడం కరెక్ట్ కాదు. మనమంతా ఒక్కటే. ఏదున్నా మనం మనం చూసుకుంటాం. అంతేకానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్లని కించపరిచేలా అలాంటి ప్రశ్నలు దయచేసి అడగొద్దు. ఇకపై అలాంటి ప్రశ్నలు అడగకండి' అని చెప్పారు. తెలుగు సినీ జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలు వివాదాస్పదంగా మారుతున్న తరుణంలో ఇకనైనా ఈ తరహా ధోరణికి వారు చరమగీతం పాడాలని లేకుంటే రానున్న రోజుల్లో జర్నలిజం వాల్యూస్ ని పోగొట్టే ప్రమాదం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications