సమంత ఫోన్ ట్యాపింగ్ నిజమా? కాదా?
తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సమంత-నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చేసే సందర్భంలో ఆమె ఎంతో శ్రుతిమించి మాట్లాడారు. అక్కినేని నాగార్జున కుటుంబంపై అభాండాలు మోపారు. సమంత, నాగచైతన్య, నాగార్జున, కేటీఆర్ ను ముడిపెట్టి చేసిన ఈ వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమ భగ్గుమంది. పరిశ్రమలోని 24 విభాగాలకు చెందినవారు తీవ్రంగా స్పందించారు. పరిశ్రమలోని ప్రతి ఒక్కరు సురేఖపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
డబ్బు కోసం వీరికి సమంత పేరు కావాలి
ఈ సందర్భంగా గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. జరిగిన సంఘటను క్యాష్ చేసుకునేందుకు కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు పెట్టిన పోస్టులు, దారుణమైన వీడియోలు చూశానని, తమ మైలేజీ పెంచుకోవడం, వ్యూస్ రప్పించుకోవడం కోసం డబ్బు కోసం సమంత పేరును ప్రముఖంగా ప్రస్తావించామని విమర్శించారు.ఇటువంటి పోస్టులు పెట్టినవారు జీవితంలోకాదుకదా.. కలలో కూడా ఆమె స్థాయిని అందుకోలేరని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించుకునేందుకు వీరందరికీ సమంత పేరు కావాలన్నారు. నవరాత్రులు జరుగుతున్న సందర్భంగా ఇంతకన్నా మంచి కార్యక్రమం మరొకటి కనపడలేదా వీరికి కర్మకాలిపోయి అని వ్యాఖ్యానించారు.

భారత రాష్ట్ర సమితి హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై సమంత స్పందించి వాస్తవాలు చెప్పాలని, అలాచెబితేనే నిజాలు బయటకు వస్తాయంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. దీనిపై అతను చిన్మయిని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతారని, అది వారి నైజం అని, చేయాల్సిందంతా చేసి వాళ్లు ఎవరికీ జవాబుదారీగా ఉండరని, ప్రజలకు తాము జవాబుదారీ అనే విషయాన్ని వారు ఎప్పుడో మర్చిపోయారన్నారు. సమంత వీరెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చిన్మయి కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం చిన్మయి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.












Click it and Unblock the Notifications