గుడ్ న్యూస్ చెప్పిన అక్కినేని కోడలు..పెళ్లైన మూడు నెలలకే

తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ. 2013లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్‌ ఇండియా ఎర్త్‌ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.

తెలుగులో మేజర్, గూఢాచారి వంటి సినిమాల్లో నటించింది. మణిరత్నం పొన్నియన్ సెల్వర్ రెండు పార్ట్స్‌లో కూడా ఈ బ్యూటీ నటించింది. 'మేడ్ ఇన్ హెవెన్', 'ద నైట్ మేనేజర్' వంటి వెబ్ సిరీస్‌లు కూడా శోభిత చేసింది. ప్రభాస్ కల్కి సినిమాలో దీపిక పాదుకొనెకు డబ్బింగ్ చెప్పింది.ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్‌ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశారు.

Sobhita Dhulipala participates in the shooting of her first film after marriage

ఈ క్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్దిమంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది.పెళ్లి తర్వాత హానీమూన్‌ను ఎంజాయ్ చేశారు ఈ జంట. మరో వైపు నాగ చైతన్య తండేల్ సక్సెస్ కావడంతో, తన తర్వాత సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. విరూపాక్ష సినిమాకు దర్శకత్వం వహించినది కార్తీక్ వర్మ దండుతో ఓ సినిమా చేయడానికి నాగ చైతన్య గ్రీన్ సీగ్నల్ ఇచ్చాడు.దీంతో శోభితా ధూళిపాళ సైతం తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది.

దీనిలో భాగంగానే శోభితా ధూళిపాళ తన కొత్త సినిమా షూటింగ్ పాల్గొంది. శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత తొలి సారిగా కెమెరా ముందుకు వచ్చారు. తాజాగా, ఈ బ్యూటీ తను చేయబోయే కొత్త ప్రాజెక్ట్ షూటింగ్‌ హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది.షూటింగ్ స్పాట్‌లో శోభిత ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పెళ్లై 3 నెలలు కూడా కాలేదు.. అప్పుడే షూటింగ్‌కు వెళ్లడంతో తన డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+