గుడ్ న్యూస్ చెప్పిన శోభిత ధూళిపాళ
తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్దిమంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత.ఇదిలా ఉంటే శోభిత ధూళిపాళ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. శోభిత ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది.తాను నటించిన 'మంకీ మ్యాన్' బాఫ్టా ఆమోదం పొందడంతో పాటు రాటెన్ టొమాటోస్ బెస్ట్ రివ్యూడ్ మూవీగా అగ్ర స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.

బ్రిటిష్ దర్శకుడు, నిర్మాత దేవ్ పటేల్ అవార్డు అందుకున్నట్లు తెలిపింది. నేను కలలు కంటున్నానా అనిపిస్తుంది. 2024 బాఫ్తా నామినేషన్‌లో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా మంకీమ్యాన్ నిలిచిందని తెలిపింది. ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభితా ధూళిపాళ. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.












Click it and Unblock the Notifications