పెళ్లైన రెండు నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన శోభిత ధూళిపాళ..ఫుల్ జోష్‌లో అక్కినేని అభిమానులు
అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు.నాగ చైతన్య- శోభిత కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో వీరు డేటింగ్‌లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరు అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చారు. వీరి పెళ్లి కూడా చాలా సింపుల్‌గానే జరిగింది.
పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ ..నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్ణమని తెలిపింది.పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు.తండేల్ సినిమా విడుదల కావడంతో అటు నాగ చైతన్య కూడా ఫ్రీ అయ్యారు. దీంతో వీరిద్దరు తమ సినిమా షూటింగ్‌లకు కొంత గ్యాప్ ఇచ్చిన హానీమూన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే శోభిత ధూళిపాళ కీలక నిర్ణయం తీసుకున్నారట. శోభిత ధూళిపాళ సినిమాల్లో యమ హాట్‌గా కనిపిస్తుంటుంది. రొమాంటిక్ సీన్లలో సైతం రెచ్చిపోయి నటిస్తోంది.అయితే పెళ్లి తర్వాత ఇలాంటి సినిమాలకు శోభిత దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఇటీవల తండేల్ సక్సెస్ మీట్‌కు వచ్చిన సమయంలో శోభిత ధూళిపాళ పద్దతిగా చీరలో వచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేసుకున్నారు.దీంతో ఇక మీదట శోభిత ధూళిపాళ తెర మీద గ్లామర్ డోస్‌కు కొంత పరిధి గీసుకున్నట్టు తెలుస్తోంది. తనవల్ల అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడకుండ ఉండేందుకే శోభిత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు శోభితపై ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications