దుబాయ్‌లో చిక్కుకున్న బాలయ్య హీరోయిన్: రక్షించమంటూ ప్రధాని మోదీకి మొర!
పశ్చిమాసియాలో నెలకొన్ని తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ప్రముఖ నటి సోనాల్ చౌహాన్ దుబాయ్‌లో చిక్కుకుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల నేపథ్యంలో గగనతలం మూసివేయడంతో విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. దీంతో తాను స్వదేశానికి తిరిగి వచ్చే మార్గం లేక ఇబ్బంది పడుతున్నానని.. తనను సురక్షితంగా భారత్‌కు చేర్చాలని ఆమె ప్రధాని మోదీని కోరారు.
సంక్షోభంలో సోనాల్ చౌహాన్
హిందీ చిత్రం 'జన్నత్'తో పాటు తెలుగులో బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'డిక్టేటర్' వంటి సినిమాల్లో నటించిన సోనాల్ చౌహాన్.. ప్రస్తుతం దుబాయ్‌లో విమానాల రద్దు కారణంగా చిక్కుకుపోయారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ప్రధాని మోదీని ఉద్దేశించి భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. "గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారు.. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం కారణంగా నేను దుబాయ్‌లో చిక్కుకుపోయాను. విమానాలన్నీ రద్దయ్యాయి, ఇండియాకు రావడానికి ఎటువంటి మార్గం కనిపించడం లేదు. ప్రభుత్వం తగిన మార్గదర్శకత్వం అందించి నేను సురక్షితంగా ఇంటికి చేరేలా చూడాలని కోరుతున్నాను" అని సోనాల్ చౌహాన్ విన్నవించారు.

ఉద్రిక్తతల నేపథ్యం
ఫిబ్రవరి 28, 2026న ఇరాన్‌లోని సైనిక, అణు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా బలగాలు దాడులు చేశాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయనే హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్, ఇరాక్, యూఏఈ వంటి దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. దీంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేలాది మంది ప్రయాణికులు నిలిచిపోయారు. సోనాల్ చౌహాన్‌తో పాటు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నట్లు సమాచారం.
విమానయాన సంస్థల స్పందన:
ఎయిరిండియా, ఇండిగో, ఎమిరేట్స్ వంటి సంస్థలు పశ్చిమాసియాకు నడిపే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించాయి. మార్చి 1, 2026న సుమారు 440కి పైగా విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. గగనతలం సురక్షితమని నిర్ధారణ అయిన తర్వాతే సర్వీసులు పునరుద్ధరిస్తామని సంస్థలు స్పష్టం చేశాయి.












Click it and Unblock the Notifications