రూ.వెయ్యి కోట్ల స్కామ్‌లో సోనూసూద్?
సోనూసూద్ గురించి భారతదేశంలోనేకాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా పరిచయం అవసరంలేదు. ఎందుకంటే కరోనా సమయంలో అంతగా ప్రజలకు సహాయం చేశాడు. ప్రభుత్వానికి మించి సాయం చేసి ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ప్రజలను వారి స్వస్థలాలకు తరలించేందుకు భారతయ రైల్వేకు డబ్బులు కట్టి, ఆ రైళ్లల్లో వారిని పంపించాడు. అంతేకాదు.. తన హోటల్ ను ఆసుపత్రిగా మార్చి కరోనా రోగులకు సహాయం చేయడంతోపాటు ఆక్సిజన సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు సరఫరా చేశాడు. దేశం మొత్తంమీద పెద్ద హీరో అయ్యాడు. సినిమాల్లో మాత్రమే తాను ప్రతినాయకుడినని, నిజ జీవితంలో మానవత్వం వెల్లివిరిసే మనిషినని నిరూపించుకున్నాడు.
డబ్బు కోసమే వాటివైపు మళ్లాడు
దానకర్ణుడిగా అందరూ సోనుసూద్ ను అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కొన్ని దేశాలు అతడికి ప్రత్యేక పురస్కారాలు అందజేశాయి. తాజాగా యూట్యూబర్ అన్వేష్ సోనూసూద్ పై సంచలన ఆరోపణలు చేశాడు. డబ్బు కోసం అతను బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లాడని, ఏకంగా రూ.వెయ్యి కోట్లు సంపాదించాడని తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చిన సోనూ సూద్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడి, సినిమాల్లో నటించి మంచిపేరు తెచ్చుకున్నాడన్నాడు. సినిమాల్లో హీరోగా నటించాలనే బలమైన కోరిక సోనూసూద్ కు ఉండేదని, దీనికోసమే బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లాడని తెలిపాడు.

ఈడీ అధికారుల దర్యాప్తు
సోనూసూద్ సంపాదనమీద ఈడీ కేసులు నమోదు చేసింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అన్వేష్ చెప్పినదాని ప్రకారం సోనూసూద్ అనేవారు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి డైనోసార్ లాంటి వ్యక్తి అని, హర్షసాయి లాంటివారు నీటిమడుగులో మొసలి లాంటివారేనన్నాడు. ఏపీ, తెలంగాణలో హర్ష సాయి ఇలాంటి వ్యవహారమే నడిపాడని, హర్షసాయి ఆధ్వర్యంలో కొందరు విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి బెట్టింగ్ చేస్తున్నారన్నాడు. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని అన్వేష్ కోరుతున్నాడు. సోనూసూద్, హర్షసాయితోపాటు అన్వేష్ బెట్టింగ్ యాప్స్ పై సన్నీ యాదవ్, సావిత్రి (శివజ్యోతి) తదితరులపై సంచలన ఆరోపణలు చేశాడు. ఇందులో వాస్తవమెంతుంది అనే విషయం త్వరలోనే తేలనుంది.












Click it and Unblock the Notifications