లిక్కర్ స్కాం బాగోతం.. బ్లాక్ మనీతోనే స్పై, మళ్లీ మొదలైంది చిత్రాలు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లిక్కర్ కుంభకోణం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రోజుకో కీలక మలుపు తిరుగుతున్న ఈ కేసులో లేటెస్ట్ గా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు స్కాం వ్యవహారంలో బ్లాక్ మనీని.. వైట్ మనీగా మార్చడానికి సినిమాలను వాడుకున్నట్టు సిట్ విచారణలో తేలింది. దీంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు రాజ్ కెసిరెడ్డి. ఆయనకు చెందిన సినీ నిర్మాణ సంస్థ ED Entertainments ను మాధ్యమంగా వాడి సుమారు రూ.40 కోట్లకు పైగా బ్లాక్ మనీని వైట్ చేసినట్టు అధికారులు గుర్తించారు.

కాగా ఈ క్రమంలోనే రాజ్ కెసిరెడ్డి 2022 లో సుమంత్ హీరోగా మళ్లీ మొదలైంది.. 2023లో నిఖిల్ సిద్ధార్థ్ తో 'స్పై' అనే చిత్రం నిర్మించారు. ఈ రెండు సినిమాల నిర్మాణం కోసం వెచ్చించిన మొత్తం రూ.40 కోట్లలో రికార్డుల ప్రకారం కేవలం రూ.12 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు చూపించి, మిగిలిన మొత్తం నకిలీ రికార్డులతో లీగల్‌గా చూపించారని SIT అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ సినిమాలు ఫ్లాప్ అయినా.. OTT, శాటిలైట్ రైట్స్ ద్వారా దాదాపు రూ.36 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని చెబుతున్నారు. ఈ రకంగా కూడా వారికి లాభం జరిగిందని వివరించారు.
మరోవైపు ప్రముఖ పాన్ ఇండియా హీరో భార్య పేరు మీదుగా ED ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి రూ.1 కోటి డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఈ నగదు ఆమెకు తిరిగి పంపలేదని, ఇది పూర్తిగా ఫేక్ లావాదేవీగా ఉందని అధికారులు స్పష్టంచేశారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో మనీలాండరింగ్ వ్యవహారం మరోసారి tera paiki వచ్చింది.
ఇక ఈ స్కామ్‌కు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్, బ్యాంక్ లావాదేవీలు, బినామీ ఖాతాల వివరాలు, అన్ని కోర్టుకు త్వరలో సమర్పించనున్నారు. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications