అల్లు శిరీష్ ఫంక్షన్ లో కనపడని మెగాస్టార్ కూతురు శ్రీజ.. కారణం అదేనా..!
ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు చేపడుతున్నాయి. అయితే ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లోని 27 అమెరికన్ బేస్ లపై దాడులు చేసింది. ఇప్పటివరకూ 9 దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. వీటిలో బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ ప్రస్తుతం తన పిల్లలతో కలిసి దుబాయ్ లో ఉన్నారు.

అయితే అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్నందున చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేసిన విషయం. ఈ క్రమంలో దుబాయ్ లో ఉన్న చిరంజీవి కూతురు శ్రీజ తాజాగా ఒక పోస్ట్ చేశారు. దుబాయ్ లో పరిస్థితిని తెలుసుకొని చాలామంది ఫోన్లు, మెసేజ్ లు చేస్తూ తమ క్షేమం కోరుకున్నారని అన్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చాలామంది తమ పట్ల ప్రేమను చూపించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. దుబాయ్ లో తాను పిల్లలతో క్షేమంగా ఉన్నానంటూ శ్రీజ పోస్టు పెట్టారు. దాంతో మెగా ఫ్యాన్స్ లో ఆందోళన తగ్గింది.

ఇక దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ఫోటోని షేర్ చేశారు శ్రీజ. ప్రస్తుతం మేము ఈ దేశాన్ని ఎంచుకున్నాము. కాబట్టి, ఈ దేశానికే కట్టుబడి ఉంటాం అని ఆమె పోస్ట్ పెట్టారు. శ్రీజ ఈ పోస్ట్ నేపథ్యంలో ఆమె తన తన పిల్లలతో ప్రస్తుతం దుబాయ్‌లో స్థిరపడినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల అల్లు శిరీష్ హల్దీ ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫంక్షన్ లో ఆమె కనిపించలేదు. అయితే దుబాయ్ లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆమె అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అల్లు శిరీష్ ఫంక్షన్ కు రాలేకపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications