మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించగా.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా.. నటి శ్రీలీల, కమెడియన్ మహేష్ ఆచంట మధ్య జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కార్యక్రమంలో పవన్ వేదికపై ప్రసంగిస్తున్నారు. ఈ వేడుకలో అంతా నిశ్శబ్ధంగా పవన్ మాటలను వింటున్న తరుణంలో.. ఆయన వెనుక నిలుచుని ఉన్న కమెడియన్ మహేశ్ ఆచంట తన ఫోన్ చూస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఆయన తన ఫోన్ వాల్యూమ్ ఆన్ చేసి ఉండటంతో అది పక్కనే ఉన్న వారికి కాస్త అసౌకర్యంగా అనిపించింది.

Sreeleela Gives Sweet Warning to Mahesh Achanta at Ustaad Bhagat Singh Pre-Release Event

స్పందించిన శ్రీలీల
మహేశ్ ఫోన్ సౌండ్ పవన్ కళ్యాణ్ ప్రసంగానికి లేదా అక్కడి వాతావరణానికి ఆటంకం కలిగిస్తుందని గమనించిన నటి శ్రీలీల వెంటనే స్పందించారు. ఆమె చాలా మర్యాదపూర్వకంగా వెనక్కి తిరిగి.. చిరునవ్వుతోనే మహేష్‌కు వాల్యూమ్ తగ్గించమని సైగ చేశారు. శ్రీలీల చేసిన ఈ 'స్వీట్ వార్నింగ్' వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

నెటిజన్ల ప్రశంసలు
శ్రీలీల ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు గౌరవంగా ఉండాలని ఆమె సూచించిన తీరు బాగుందని అభిప్రాయపడుతున్నారు. కమెడియన్ మహేష్ కూడా ఆమె చెప్పగానే వెంటనే ఫోన్ సౌండ్ తగ్గించి, పరిస్థితిని చక్కదిద్దారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+