అన్న వస్తాడు.. హిట్టు కొట్టి పోతాడు.. ఇదే రిపీటు..!
టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ఒకరు. శ్రీవిష్ణు సినిమా అనగానే తెలుగు ప్రేక్షకుల్లో ఓ తెలియని వైబ్ ఏర్పడుతుంది. ఆయన సినిమాల్లో ఎక్కువగా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేట్టు చూసుకుంటారు. అందుకే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్, ఆ తర్వాత అల్ల రి నరేష్ తమ సినిమాలతో ఎలా అలరించేవాళ్లో ఇప్పుడు శ్రీవిష్ణు కూడా అలా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో వరుస హిట్స్ కొడుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జానర్ ఫార్ములాతో ఇప్పటికే ఆయన చాలా హిట్స్ కొట్టారు. అయితే ఇటీవల శ్రీవిష్ణు ప్రధానపాత్రలో వచ్చిన మూవీ కామ్రేడ్ కళ్యాణ్.. ఈ మూవీ అక్టోబర్ 9 న విడుదలైంది. ఎప్పటిలాగానే ఈ మూవీతోనూ శ్రీవిష్ణు హిట్ కొట్టారు.
విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓపెనింగ్స్ విషయంలో ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం రూ. 7 కోట్ల 50 లక్షల రూపాయిలతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ మూవీ.. కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా 90 శాతానికి పైగా రీకవరీని సంపాదించి లాభాల్లోకి అడుగుపెట్టింది. నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో చూస్తే.. ముఖ్యంగా నైజాం నుంచి కామ్రేడ్ కళ్యాణ్ మూవీ రూ. 6 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ ను రాబట్టింది.

అలాగే ఏపీ నుంచి రూ. 5 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ ను రాబట్టింది. అలా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 11 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఇక తెలుగు రాష్ట్రాలతోపాటు ఈ చిత్రానికి కర్ణాటక, ఓవర్సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూల్లు దక్కాయి. ఓవరాల్ గా చూస్తే ఈ మూవీకి రూ. 15 కోట్ల గ్రాస్ వసూల్లు.. అలాగే రూ. 7 కోట్ల 10 లక్షల షేర్ వసూల్లు దక్కాయి. ఇక 24 గంటల్లో ఈ మూవీ అనేక ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని శ్రీవిష్ణు కెరీర్ లో మరో క్లీన్ హిట్ గా నిలవబోతుంది.












Click it and Unblock the Notifications
