చిన్న సినిమాకు మద్దతుగా రంగంలోకి దిగిన యంగ్ హీరో
సరికొత్త హారర్ కామెడీగా ప్రేక్షకుల్లో ఉత్సుకత రేపుతున్న "లోపలికి రా చెప్తా" చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కొండా వెంకట రాజేంద్ర కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు.
తాజాగా, ఈ సినిమా నుంచి నాలుగవ పాట 'టిక్ టాక్ చేద్దామా..'ను యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తోంది.

"లోపలికి రా చెప్తా" చిత్రం టైటిల్ ప్రకటన నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. విడుదలైన ప్రతి కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ కంపోజ్ చేసిన పాటలన్నీ ఛాట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇటీవల ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేసిన ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. హారర్ కామెడీ జానర్‌లో ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న "లోపలికి రా చెప్తా" సినిమా విజయంపై చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉంది.












Click it and Unblock the Notifications