'తప్పులేదు ప్రేమలో'.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
"కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ" మూవీతో తొలి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది టాలీవుడ్ హీరోయిన్ కాకినాడ శ్రీదేవి. జాబిల్లిగా ఈ మూవీలో తన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించారు. 2025 మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యువ నటీనటులతో పాటు ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి, ప్రముఖ నటుడు సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

అయతే తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి. అయితే తాజాగా శ్రీదేవి గుడ్ న్యూస్ ప్రకటించింది. తన కొత్త తమిళ సినిమా పూజా కార్యక్రమంలో కోలీవుడ్ నటుడు కెజెఆర్ తో కనిపించింది. దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోర్టు మూవీలాగే ఈ సినిమా కూడా విజయవంతం కావాలని కామెంట్స్ చేస్తున్నారు.
Telugu actress #SrideviApalla "Court" is making her Tamil debut in a film starring #KJRRajesh.
— Movie Tamil (@MovieTamil4) July 7, 2025
KJR Rajesh next to #Angikaaram, this film will be his next pic.twitter.com/9H8rKMHYGT
కోర్ట్ సినిమాతో పాపులర్ అయిన టాలీవుడ్ హీరోయిన్ కాకినాడ శ్రీదేవి ప్రస్తుతం తమిళ సినిమాలో హీరోయిన్ గా అడుగుపెడుతోంది. కేజేఆర్ హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా కొత్త సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మినీ స్టూడియో బ్యానర్ పై రెగన్ స్టానిస్లాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోర్ట్ సినిమాలో నటనతో మెప్పించిన శ్రీదేవి.. మరి తమిళ సినిమాలో ఎలా చేస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications