ఆ స్టార్ నటుడి భార్య ఇంత బోల్డ్ రోల్ చేసిందా ? మూవీ కూడా బ్యాన్ ??

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు "జేడీ చక్రవర్తి". తన సినీ ప్రయాణాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివతో ప్రారంభించారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆయన నటించిన 'మనీ', 'గులాబీ', 'అనగనగా ఒక రోజు', 'బొంబాయి ప్రియుడు', 'ఎగిరే పావురమా', 'ప్రేమకు వేళాయేరా' వంటి సినిమాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ జాబితాలో నిలిచాయి. అనంతరం సత్య, కంపెనీ, ఏక్ హసీనా థీ వంటి హిందీ చిత్రాల్లో కూడా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా, సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకోగలిగారు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు గట్టి పోటీనిచ్చిన జేడీ.. 'దుబాయ్ శీను', 'హోమం', 'జోష్' వంటి చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రెండో ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

sridevi-movie-actress-anukruthi-sharma-is-wife-of-jd-chakravarthi-news-got-viral-on-media

ఇక జేడీ చక్రవర్తి భార్య అనుకృతి శర్మ కూడా ఒక నటి అన్న విషయం చాలామందికి తెలియదు. 2016లో వివాహం చేసుకున్న ఈ జంట గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే అనుకృతి శర్మ కెరీర్ విషయానికి వస్తే, ఆమె రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వివాదాస్పద చిత్రం 'శ్రీదేవి' (గతంలో 'సావిత్రి')లో కథానాయికగా నటించింది.

అయితే టీచర్‌ను ప్రేమించే కుర్రాడి బోల్డ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా పోస్టర్లు అప్పట్లో భారీ దుమారాన్నే లేపాయి. అయితే సెన్సార్ సంబంధిత, ఇతర కారణాల వల్ల ఈ చిత్రం విడుదల కాలేదు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆయన 'చేతబడి' అనే విభిన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+