విక్టరీ వెంకటేశ్ కూతురిగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా?
విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకెళ్తున్నారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై వెంకీ మామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలించింది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. రూ. 50 కోట్లతో నిర్మితమై.. ఏకంగా రూ. 300 కోట్ల వరకు రాబట్టి వెంకటేశ్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఈ సినిమాతో వెంకీమామ మళ్లీ టాప్ హీరో రేంజ్ లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వెంకటేశ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పడు చిరంజీవితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో ఓ కీలక పాత్రలో వెంకటేశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో ఆయన పాల్గొంటారు.
ఇక అంతేకాక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ వెంకటేశ్ ఓ సినిమా చేస్తున్నారు. చిరంజీవితో సినిమా తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ మూవీ ఓ పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. వెంకటేశ్ గత సినిమాలైన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు అందించిన విషయం తెలిసిందే. దీంతో త్రివిక్రమ్- వెంకీ కాంబోలో వస్తున్న ఈ మూవీ కూడా ఇదే రేంజ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తుందని అందరూ భావిస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే ఓ నటి వెంకటేశ్ కు కూతురిగా.. ప్రియురాలిగా నటించింది. ఆమె ఎవరో తెలుసా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలోని అగ్ర హీరోలతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

1971లో అక్కినేని నాగేశ్వరరావు, వాణి శ్రీ నటించిన ప్రేమ్ నగర్ సినిమా తెలుగు బిగ్ హిట్ అయింది. అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశారు మేకర్స్. 1972లో శివాజీ గణేశన్ నటించిన సినిమానే వసంత మాళిగై. తమిళంలోనూ ఈ మూవీ భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో వెంకటేశ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ఇందులో శివాజీ గణేశన్ సోదరుడు విజయ్ పాత్రను వెంకటేశ్ చేశారు. అయితే ఈ సినిమాలో శివాజీ సోదరుడు విజయ్ కూతురిగా శ్రీదేవి నటించింది. అంటే ఇందులో వెంకీ కూతురిగా కనిపించింది శ్రీదేవి.
వసంత మాళిగై సినిమాలో వెంకీ కూతురిగా నటించిన శ్రీదేవి.. 19 ఏళ్ల తర్వాత ఆయనతో కలిసి క్షణ క్షణం చిత్రంలో నటించింది. 1991లో ఈ చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చింది. వెంకటేశ్, శ్రీదేవి జంటగా నటించిన ఏకైక సినిమా ఇదే కావడం విశేషం.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications