‘రామాయణ'పై రాజమౌళి కామెంట్స్.. రణ్‌బీర్-సాయిపల్లవి మూవీపై జక్కన్న ఏమన్నారంటే?

SS Rajamouli on Ramayana Movie: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో 'వారణాసి' సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ జక్కన్న ఏమన్నారంటే?

7 సార్లు ఛాన్స్ వచ్చినా నో ఛాన్స్.. హీరోయిన్ విషయంలో బిగ్ ట్విస్ట్!
7 సార్లు ఛాన్స్ వచ్చినా నో ఛాన్స్.. హీరోయిన్ విషయంలో బిగ్ ట్విస్ట్!

రణ్‌బీర్ రాముడిగా.. సాయిపల్లవి సీతగా
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణ'లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నారు. సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ కాంబినేషన్‌తో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి ఎలా కనిపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

SS Rajamouli on Ramayana Movie

ఇక దర్శకుడు నితేశ్ తివారీ విషయానికి వస్తే.. 'దంగల్' సినిమాతో సంచలనం సృష్టించారు. ఆమిర్ ఖాన్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. 'చిచ్చోరే'తోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి భారీ విజయం అందుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు 'రామాయణ' వంటి భారతీయ ఇతిహాసాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి.. సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం!
కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి.. సీఎం రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం!

రాజమౌళి పోస్ట్‌తో మరింత ఆసక్తి
రామాయణం భారతీయులకు ఎంతో పరిచయమైన ఇతిహాసం. గతంలో ఎన్టీఆర్ నటించిన 'సీతారామ కళ్యాణం' నుంచి ప్రభాస్ 'ఆదిపురుష్' వరకు ఈ కథ ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ప్రతి దర్శకుడు తనదైన శైలిలో ఈ ఇతిహాసాన్ని ఆవిష్కరించడం ఆసక్తిని పెంచుతుంది. ఇప్పుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణ'పై కూడా అదే స్థాయిలో ఆసక్తి నెలకొంది.

పెళ్లి పీటలెక్కిన 7 ఆర్ట్స్ సరయు.. జీవితంలో కొత్త ఛాప్టర్ అంటూ ఎమోషనల్
పెళ్లి పీటలెక్కిన 7 ఆర్ట్స్ సరయు.. జీవితంలో కొత్త ఛాప్టర్ అంటూ ఎమోషనల్

ఇలాంటి సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి స్వయంగా సినిమా గురించి ప్రశంసలు కురిపించారు. "రామాయణం అనేది ప్రతి భారతీయ కథకుడు చిన్నప్పటి నుంచే చెప్పాలని కలలు కనే గొప్ప కథ. అలాంటి కథను నితేశ్ తివారీ, నమిత్ మల్హోత్రా ఇంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావడం చూడటం ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ కాలాతీతమైన పాత్రలకు ఎంతో లోతైన నటనతో ప్రాణం పోశారు. నవంబర్ 5 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మూవీ టీం మొత్తానికి బెస్ట్ విషెస్ " అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'రామాయణ' పార్ట్ 1 నవంబర్ 5, 2026 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+