మహేష్‌బాబును క్షమించమని కోరిన స్టార్ డైరెక్టర్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. తన 29వ సినిమాగా ఇది రాబోతోంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 చివరలోకానీ, 2027 ప్రారంభంలోకానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. కీరవాణి సంగీతాన్ని అందిచబోతున్నారు. అటవీ ప్రాంతంలో యాక్షన్ అడ్వెంచర్ గా దీన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఎవరికీ చెప్పకుండా షూటింగ్ ను ప్రారంభించారు.
నిలుపులోలేకపోయినందుకు క్షమించాలి
మహేష్ బాబు హీరోగా మంచిపేరు తెచ్చుకొని దూసుకువెళుతున్న తరుణంలో అప్పుడు దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయాల్సి ఉంది. వర్మతో సినిమా అంటే అందరు హీరోలు ఎదురుచూసే సందర్భం అది. వర్మ మహేష్ బాబుకు కచ్చితంగా మీతో సినిమా చేస్తాను అని మాట ఇచ్చారు. అయితే అనుకోని కారణాలు, ఇతరత్రా సినిమాలతో బిజీగా ఉండటంతో మహేష్ బాబుకు ఇచ్చిన మాటను వర్మ నిలుపుకోలేకపోయాడు.దానికి ఆయ ఎంతో బాగా ఫీలయ్యారు. సూపర స్టార్ ను స్వయంగా కలిసి సినిమా తీయలేకపోయినందుకు క్షమించమని కోరారు. ఒకరకంగా వర్మ చాలా గొప్ప మనసుతో వ్యవహరించారని చెప్పొచ్చు.

సారీని ప్రిన్స్ అంగీకరించలేదు
మహేష్ బాబు వర్మ చెప్పిన సారీని అంగీకరించలేదు. అనుకోని కారణాలవల్ల కుదర్లేదు కాబట్టి దానికి మీరు ఎక్కువగా ఫీలవ్వాల్సిన పనిలేదని అన్నారు. ఏదేశమైనప్పటికీ వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వచ్చివుంటే తెలుగు సినీ చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసివుండేదని భావిస్తున్నారు. అంత ఫాంలో ఉన్న వర్మ ప్రస్తుతం తాను చేసిన పనులకు బాధపడుతున్నానని, అమితాబ్, వెంకీలతో మంచి సినిమా చేసి తనకున్నచెడ్డపేరును చెరిపేసుకుంటానని చెబుతున్నారు. మరి వాళ్లిద్దరూ కాల్షీట్లు ఇస్తారో? లేదో? చూడాలి. అమితాబ్ కు సర్కార్, వెంకీకి క్షణక్షణంలాంటి సూపర హిట్లు వర్మ ఇచ్చాడు.












Click it and Unblock the Notifications