బడా బిజినెస్ మాగ్నెట్ ను పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ హీరోయిన్
ప్రస్తుతం తెలుగు, తమిళం అనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లోని హీరో, హీరోయిన్లు సాధ్యమైనంత త్వరగా వివాహాలు చేసుకుంటారు. వారి ఆలోచనా తీరులో మార్పు చోటుచేసుకుంటోంది అనడానికి ఇది ఒక నిదర్శనం. కొంతమంది మాత్రం వివాహాలు చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మాచారులుగా ఉండిపోతామని చెబుతుండగా, మరికొందరు మాత్రం వెంటవెంటనే వివాహాలు చేసుకుంటున్నారు. కొందరు హీరో, హీరోయిన్లైతే ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు.
చేసింది తక్కువ సినిమాలే అయినా...
తాజాగా దక్షిణాది యంగ్ బ్యూటీ అయిన పార్వతి నాయర్ తెలుగులో నాని సరసన జెండాపై కపిరాజు అనే సినిమాలో నటించింది. 2015 మార్చి 21న విడుదలైన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించారు. వాణిజ్యపరంగా ఆశించినస్థాయిలో ఈ సినిమా ఆడకపోయినప్పటికీ నాని మంచిపేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన పార్వతి నాయర్ తర్వాత తమిళం, మళయాళ భాషల్లో కలిపి మొత్తం 30కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తక్కువ సినిమాలే చేసినప్పటికీ నటిగా మాత్రం మెప్పించింది.

అశ్రిత్ ను ప్రేమించి.. పెద్దలను ఒప్పించి
తాజాగా ఈ అమ్మడు బడా బిజినెస్ మాగ్నెట్ అయిన అశ్రిత్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. కొంతకాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెద్దలను ఒప్పించి ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్నారు. తాజాగా తన ప్రియుడితో కలిసి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పార్వతి ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతోపాటు నెటిజన్లు కూడా కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. జంట చాలా బాగుందని, నాగచైతన్య-సమంత తర్వాత పార్వతి నాయర్ - అశ్రిత్ జంట చూడముచ్చటగా ఉందని కొందరంటున్నారు. ఆమె వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.












Click it and Unblock the Notifications