అమ్మాయితో ఉన్నప్పుడు భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్టార్ హీరో భార్య
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకర్ని వివాహం చేసుకున్న వారే.బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో రణబీర్ కపూర్ ఒకరు. రిషి కపూర్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రణబీర్ కపూర్ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.
ఇదే సమయంలో మనోడు ఎఫైర్స్‌తో కూడా వార్తల్లో నిలిచేలా చేశాయి. స్టార్ హీరోయిన్లతో రణబీర్ కపూర్ డేటింగ్ చేశాడు. దీపికా పదుకొనే,కత్రినా కైఫ్,ఆలియా భట్,మహిరా ఖాన్ వంటి హీరోయిన్స్‌తో రణబీర్ కపూర్ రిలేషన్ మెయిన్‌టైన్ చేశాడు. ముఖ్యంగా రణబీర్ కపూర్-దీపికా పదుకొనే ఎఫైర్ రిలేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. రణబీర్ కపూర్, దీపికా పదుకొనే బాలీవుడ్‌లో ఒకప్పుడు బాగా పాపులర్ అయిన జంట. వీళ్లిద్దరూ చాలాకాలం డేటింగ్ చేశారు.

రణబీర్, దీపికా 2007లో 'బచ్నా ఏ హసీనో' సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ సమయంలోనే వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం పాటు ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. దీపికా ఏకంగా రణబీర్ పేరును తన మెడపై టాటూ వేయించుకుంది. వీరిద్దరూ బహిరంగంగానే తమ ప్రేమను వ్యక్తం చేశారు. పార్టీలు, సినిమా ఫంక్షన్లలో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.కొన్ని కారణాల వల్ల వాళ్ల మధ్య మనస్పర్థలు రావడంతో 2009లో విడిపోయారు. రణబీర్ మోసం చేయడం వల్లే విడిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
దీపికా ఒక ఇంటర్వ్యూలో రణబీర్ తనను మోసం చేశాడని, అందుకే విడిపోయానని చెప్పింది. దీనిపై దీపికా మాట్లాడుతూ..తాను రిలేషన్‌లో ఉన్నప్పుడు ఎవర్ని మోసం చేయలేదు. కానీ నా పార్టనర్ మాత్రం మరో అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడం చూసి నేను బాధపడ్డానని దీపికా చెప్పుకొచ్చింది. అందుకే రణబీర్‌తో దీపికా బ్రేకప్ చేసుకుంది.అయితే రణబీర్ ఎవరితో ఉన్నప్పుడు దీపికా చూసిందనే మాత్రం వెల్లడించలేదు.విడిపోయాక కూడా వీరిద్దరూ స్నేహితులుగా కొనసాగారు.కత్రినా కైఫ్‌తో కలిసి ఉండటం చూసిన తర్వాతే రణబీర్‌కు దీపికా బ్రేకప్ చెప్పిందనే చర్చ బాలీవుడ్‌లో సాగింది.
బ్రేకప్ తర్వాత వీరిద్దరు'యే జవానీ హై దీవానీ', 'తమాషా' వంటి సినిమాల్లో కలిసి నటించారు. దీపికాతో విడిపోయిన తర్వాత, కత్రినాతో రణబీర్ రిలేషన్ మెయిన్‌టైన్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో బ్రేకప్ చెప్పి ఆలియా భట్‌తో ప్రేమలో పడ్డాడు.రణబీర్ కపూర్, ఆలియా భట్ 2022లో వివాహం చేసుకున్నారు.వీరికి "రాహా" అనే కుమార్తె ఉంది.ఇక రణబీర్ కపూర్‌తో తర్వాత దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌తో డేటింగ్ చేసింది.వీరి వివాహం 2018 నవంబర్ 14,తేదీలో ఇటలీలోని లేక్ కోమోలో కొంకణి, సింధీ సంప్రదాయాల్లో జరిగింది.ఇటీవలే సెప్టెంబర్ 8, 2024 న, ఆమె ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది.












Click it and Unblock the Notifications