రాజమౌళి - మహేష్‌బాబు సినిమాకు బీజీఎం ఇస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్?

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రాన్ని ఎస్ఎస్ఎంబీ 28 పేరుతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో ఉంచుకొని మీడియాకు విషయాన్ని తెలియజేస్తే అభిమానులు భారీ సంఖ్యలో వస్తారని, తొక్కిసలాట జరుగుతుందనే ఉద్దేశంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన అతి త్వరలోనే బయటకు వెల్లడించనున్నారు.

చర్చలు జరిపినట్లు తెలుస్తోంది
దుర్గా ఆర్ట్స్ పతాకంపై రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో డాక్టర్ కె.ఎల్.నారాయణ దీన్ని నిర్మించబోతున్నారు. ఎప్పటిలానే ఈ సినిమాకు సంగీత దర్శకత్వ బాధ్యతలు కీరవాణి తీసుకున్నారు. అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమా కావడంతోపాటు అంతర్జాతీయంగా అన్నిభాషల్లో విడుదల చేయాలని, హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉండాలని భావిస్తున్న రాజమౌళి తన సాంప్రదాయాన్ని పక్కనపెట్టి కీరవాణిని పాటల వరకే పరిమితం చేశారు. సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కీలకం కావడంతోపాటు అంతర్జాతీయంగా వెళ్లేటప్పుడు కచ్చితంగా దాన్నిగురించే ప్రస్తావన వస్తుంది. అందుకనే తన సినిమాకు బీజీఎం ను అందించేలా అనిరుధ్ రవిచందర్ తో రాజమౌళి చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.

star music director will provied BGM for Rajamouli - Mahesh Babu s film

కోర్ ఎమోషన్ అనేది కనెక్ట్ కావాలంటే..
బీజీఎం సరిగా లేకపోతే కోర్ ఎమోషన్ అనేది ప్రేక్షకులకు అంత తొందరగా అతకదని, అందుకే బీజీఎం అనిరుధ్ చేత ఇప్పించాలని రాజమౌళి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కీరవాణికి చెప్పి ఒప్పించుకున్నారు. పాన్ వరల్డ్ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలంటే అనిరుధ్ చేత తనకు కావాల్సిన రీతిలో బీజీఎం తీసుకోవాలని దర్శక ధీరుడు భావిస్తున్నారు. పలువరు సినీ విశ్లేషకులు సైతం రాజమౌళి నిర్ణయాన్ని అంగీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నప్పుడు ఇది సరైన నిర్ణయమేనంటున్నారు. ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన నవల నుంచి తనకు కావల్సిన విధంగా రాజమౌళి దీన్ని రచయిత, తన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ చేత రాయించుకున్నారు. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+