మహేష్‌బాబు సరికొత్త రికార్డు... ఏ హీరోకైనా కష్టమే!
సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ, గోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. దాదాపు రూ.1500 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండటంతో జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. కథానాయికగా విదేశీ భామ ఒకరు ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం మహేష్ బాబు జుట్టు, గడ్డం పెంచి కొత్త లుక్ లో కనిపిస్తున్నారు.
అన్నీ రూ.100 కోట్లపైనే షేర్లు
అగ్ర దర్శకులెవరూ ఖాళీగా లేకపోవడంతో చిన్న దర్శకులతోనే సినిమాలు చేసి నాన్ బాహుబలి కేటగిరిలో కొత్త రికార్డులను సాధించిన ఘనతను మహేష్ బాబు సొంతం చేసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన భరత్ అనే నేను సినిమా రూ.101 కోట్ల షేర్ ను రాబట్టింది. తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన మహర్షి సినిమా కూడా రూ.105 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా చేశాడు. ఇది కూడా రూ.139 కోట్ల షేర్ రాబట్టింది.

ఐదు సినిమాలతో రూ.566 కోట్లు
గీతగోవిందం దర్శకుడు పరశురాం దర్శకత్వంలో సర్కారువారిపాట సినిమా చేశాడు. యావరేజ్ టాక్ వచ్చింది. అయినా తనకున్న క్రేజ్ తో ఈ సినిమా కూడా రూ.111 కోట్ల షేర్ రాబట్టింది. చివరగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన గుంటూరు కారం సినిమా గురించి తెలిసిందే. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినారూ.112 కోట్ల షేర్ వచ్చింది. ఈ ఐదు సినిమాలతో కలిపి మహేష్ బాబు రూ.567 కోట్ల షేర్ రాబట్టారు. తెలుగులో మరే హీరోకు ఇది సాధ్యం కాలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్తులో అయినా ఎవరైనా సాధిస్తారేమో చూడాలి. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న చిత్రానికి దాదాపు మూడు సంవత్సరాల సమయం కేటాయించే వీలుంది. 2027లో సినిమా విడుదల అవడానికి అవకాశం ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications