అట్టర్ ఫ్లాపైనా 200 రోజులు ఆడిన మహేష్‌బాబు సినిమా
ఒకప్పుడు సినిమా విడుదలైందంటే రెండు సంవత్సరాలు, ఒక సంవత్సరం, 500 రోజులు, 365 రోజుల చొప్పున థియేటర్లలో ఆడుతుండేవి. అయితే కాలనుగుణంగా అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఇమిడిపోయాయి. కంపెనీలు చౌకగా డేటాను ఇస్తుండటంతో ప్రపంచమంతా అరచేతిలోనే ఇమిడిపోయింది. దీంతో సినిమాలు కూడా ఎక్కువ ధియేటర్లలో విడుదలై మొదటి రెండు వారాల్లోనే తాము పెట్టిన పెట్టుబడులను తిరిగి తెచ్చుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో ఏ సినిమా అయినా కనీసం అర్థ శతదినోత్సవం, శత దినోత్సవం జరుపుకుంటే అది సంచలన పరిణామంగా చెప్పొచ్చు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో
అనూహ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినమా ఒకటి 200 రోజులు ప్రదర్శితమైంది. అందులోను ఆ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా కాదు.. అట్టర్ ఫ్లాప్ సినిమా. అయినప్పటికీ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని వెంకటేశ్వర థియేటర్ లో రోజు నాలుగు ఆటలతో 200 రోజులు పూర్తిచేసుకుంది. కేవలం మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ మీదే ఇన్నిరోజులు ఆ ఫ్లాప్ సినిమా థియేటర్ లో ఆడింది. అది ఏదోకాదు.. గుంటూరు కారం. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేసిని మూడో సినిమా ఇది. ఈసారైన బ్లాక్ బస్టర్ ఇస్తాడనుకుంటే అత్యంత సాదాసీదా చిత్రాన్ని తీసి ప్రేక్షకులమీదకు రుద్ది తన కెరీర్ ను కూడా ప్రశ్నార్థకం చేసుకున్నాడు.

బ్రేక్ ఈవెన్ తో బయట పడింది
కేవలం మహేష్ బాబు ఇమేజ్ మీద ఈ సినిమా రూ.180 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ తో బయటపడింది. సూపర్ స్టార్ నటనతోపాటు చేసిన నటన, నృత్యాలు, శ్రీలీల చేసిన నృత్యాలు మినహా ఈ సినిమాలో చెప్పుకోదగినదంటూ ఏమీలేదు. సినిమా విడుదలైన తర్వాత సామాజిక మాధ్యమాల్లో మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ ను దారుణంగా తిట్టిపోశారు. అతనిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు కారం ధాటికి ఇంతవరకు త్రివిక్రమ్ మీడియా ముందుకు రాలేదు. త్వరలోనే అల్లు అర్జున్ తో సినిమా చేయాలనే యోచనలో ఉన్నాడు. అందుకు తగ్గ కథను సిద్ధం చేసుకుంటున్నాడు. మహేష్ బాబు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా త్రివిక్రమ్ మాత్రం మారడంటూ ప్రిన్స్ అభిమానులు అతన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications