ఫోన్ పేలో మహేష్ బాబు వాయిస్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడే పాన్ ఇండియా మార్కెట్ లోకి ఇంకా అడుగుపెట్టలేదు. అయితే ఆయనకున్న ఫాలోయింగ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ మూవీలో నటించబోతున్న ప్రిన్స్ ఈ సినిమాతో ఎన్ని సంచలనాలు నమోదు చేయనున్నాడో అని యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాతో సంచలనాలు సృష్టించబోతున్న మహేష్ బాబు ను తమ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా చేసుకోవాలని, తమ వాణిజ్య ప్రకటనల్లో నటింపచేసేలాని చాలామంది కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగులో ఎక్కువ వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తున్న నటుడెవరైనా ఉన్నారా అంటే అది మహేష్ బాబు అని చెప్పొచ్చు. అంత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. తాజాగా మహేష్ బాబు ఛరిష్మాను ఉపయోగించుకోవడానికి ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే రంగంలోకి దిగింది. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లకు మహేష్ తన గొంతును అరువు ఇవ్వబోతున్నారు.

ఫోన్ పే నుంచి డబ్బును పంపిస్తున్నప్పుడల్లా, క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినప్పుడల్లా మనీ రిసీవ్ అంటూ కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ వస్తుంది. ఈ వాయిస్ లో చాలామంది సూపర్ స్టార్ల గొంతులను విన్నాం. ఇకనుంచి మహేష్ బాబు గొంతును వినబోతున్నాం. మహేష్ వాయిస్ తో కొన్ని శాంపిల్స్ తీసుకొని AIతో వాయిస్ ను జనరేట్ చేసింది సంస్థ.
PhonePe @urstrulyMahesh
— Maheshbabu Fan Club (@MaheshBabu_FC) February 20, 2024
pic.twitter.com/tTK6oeGvA4
ఇకనుంచి ఫోన్ పే స్పీకర్లలో నగదు లావాదేవీలు జరిగినప్పుడల్లా మహేష్ బాబు వాయిస్ వినొచ్చు. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ తో ఫోన్ పే స్పీకర్స్ వచ్చాయి. అలా తన వాయిస్ ను వినిపించినందుకు అమితాబ్ కొంత ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మహేష్ బాబు కూడా ఛార్జ్ చేస్తున్నారా? లేదంటే ఉచితంగా గొంతును అరువిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications