మహేష్‌బాబు వద్దన్న బ్లాక్‌బస్టర్ 1000 రోజులు ఆడింది

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తోంది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆమె రెండురోజుల క్రితమే హైదరాబాద్ చేరుకుంది. ప్రియాంకన్నా నవోమీస్కాట్ అయితే మహేష్ బాబు పక్కన చాలా బాగుందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల సమయం ప్రిన్స్ కేటాయించబోతున్నారు.

తెలుగులో నాగచైతన్య, సమంత చేశారు
గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మహేష్ బాబువదులుకున్న సంగతి తెలిసిందే. అందులో 'ఏమాయ చేశావే' కూడా ఉంది. నాగచైతన్య, సమంత ఈ సినిమాలో కార్తీక్, జెస్సీ పాత్రల్లో జీవించారు. దర్శకుడు గౌతమ్ మీనన్ ముందుగా మహేష్ బాబుతోనే సినిమా చేద్దామనుకున్నారు. తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకే హీరో అనుకున్నారు. అయితే మాస్ సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమ పాత్రలు వద్దని ప్రిన్స్ చెప్పడంతో తమిళంలో శింబు, త్రిష జంటగా 'విన్నైతాండి వరువాయా' పేరుతో ఈ సినిమాను తీశారు. తర్వాత తెలుగులో ఏమాయచేశావో పేరుతో విడుదలైంది. తెలుగులో నాగచైతన్య, సమంత నటించిన సంగతి తెలిసిందే.

Superstar Mahesh Babu s missed blockbuster completes 1000 days in theaters

బాధపడుతున్న ప్రిన్స్ అభిమానులు
'విన్నైతాండి వరువాయా' సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదలై సంచలన విజయం సాధించింది. 15 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. శింబు, త్రిష కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీకి ఈ సినిమాను కచ్చితంగా విడుదల చేస్తారు. అలా 15 సంవత్సరాల నుంచి విడుదల చేస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం మంచి కలెక్షన్లను రాబడుతూనే ఉంది.

థియేటర్లలో 1000 రోజులు ఆడింది. ప్రస్తుతం నటుడిగా దూసుకుపోతున్న వీటీవీ గణేష్ ఈ సినిమాతోనే నటుడిగా అడుగుపెట్టారు. అంతకుముందు ఆయన మంచి పేరున్న సినిమాటోగ్రాఫర్. వివేక్ డేట్లు ఖాళీ లేకపోవడంతో గౌతమ్ మీనన్ గణేష్ చేత నటింపచేశారు. ఏదేమైనప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాను మహేష్ బాబు వద్దనుకున్నారంటూ ఆయన అభిమానులు బాధపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+