'నేను సవతి తల్లి అని తెలియగానే'.. స్టార్ హీరోపై ఓపెన్ అయిన నటి
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. కబీర్ సింగ్, పద్మావత్, జెర్సీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల దేవ మూవీతో అలరించాడు. ప్రస్తుతం అర్జున్ ఉస్తారా చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే షాహిద్ కపూర్ చిన్నతనంలో పేరెంట్స్ విడిపోయారు. షాహిద్ కపూర్ తల్లిదండ్రులు నీలిమ అజీమ్- పంకజ్ కపూర్ కాగా.. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పంకజ్.. నటి సుప్రియ పాఠక్ ను 1988 లో రెండో పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ తో అనుబంధాన్ని చెప్పుకొచ్చింది సుప్రియా పాఠక్. నేను పంకజ్ ను వివాహం చేసుకున్నప్పుడు షాహిద్ పసి పిల్లాడని తెలిపింది. తాను సవతి తల్లిని అని చాలా రోజులకు అతడికి అర్థం అయిందని పేర్కొంది. అతను కూడా నా కొడుకే. తల్లీకొడుకుల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో మా మధ్య కూడా అదే ఆత్మీయత ఉంటుంది.. అని సుప్రియా పాఠక్ తెలిపింది.
షాహిద్‌కు కన్నతల్లిని కాకపోయినా అతడు నా కొడుకే అనిపిస్తూ ఉంటుంది. రుహాన్, సనాతో పాటు షాహిద్ కూడా నా పిల్లలే అని భావిస్తుంటాను. ఈ ముగ్గురితోనూ ప్రేమగా ఉంటాను.. పోట్లాడతాను అని చెప్పుకొచ్చింది. ఇక పంకజ్ కపూర్, సుప్రియ పాఠక్ లకు కుమారుడు రుహాన్, కూతురు సనా సంతానం.

ఇక షాహిద్ కపూర్ కబీర్ సింగ్ సినిమా 2019లో బాలీవుడ్‌లో విడుదలై రికార్డులు క్రియేట్ చేసింది. రూ.60 కోట్లతో రూపొందించగా.. రూ.379 కోట్లు వసూలు చేసింది. ఇందులో షాహిద్ కపూర్ సరసన కియారా అడ్వాణీ నటించింది. దీనికి కూడా సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహించారు. ఇక తెలుగులోనూ అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు తెచ్చింది ఈ మూవీ. అయితే అర్జున్‌రెడ్డి 10వ వార్షికోత్సవం నాటికి ది సందీప్ వంగా అర్జున్ రెడ్డి ఫుల్ కట్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో 2027లో ఈ సినిమా ఫుల్ వెర్షన్ వచ్చే అవకాశముందని ప్రేక్షకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications