అప్పుడే ఓటీటీలోకి సూర్య, త్రిష బ్లాక్ బస్టర్ మూవీ.. ఎందులో చూడాలంటే..?

తమిళ స్టార్ హీరో సూర్య సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. సూర్య ప్రతిష్టాత్మక చిత్రం కంగువ ఎన్నో అంచనాల మధ్య రిలీజై ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన రెట్రో మూవీ కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. అయితే తాజాగా సూర్య హీరోగా నటించిన కరుప్పు(తెలుగులో వీరభద్రుడు) చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. మే 15న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం సృష్టిస్తోంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో ఈ మూవీ రిలీజైంది. తెలుగులోనూ హిట్ టాక్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కరుప్పు మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సూర్య సరసన హీరోయిన్ గా త్రిష నటించింది. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాశ్ బాబు నిర్మించారు. ఈ మూవీలో ఆర్జే బాలాజీ, ఇంద్రాన్స్, స్వసిక విజయ్ అలాగే శివాడ నయార్, యోగిబాబు, సుప్రీత్ రెడ్డి, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సూర్య కరుప్పు మూవీ రిలీజైన కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.

Suriya and Trisha Blockbuster Karuppu Now ready to Streaming on OTT Here Where You Can Watch It

ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరుప్పు మూవీని నెట్ ఫ్లిక్స్ సంస్థ కేవలం రూ. 35 కోట్లకు కొనుగోలు చేసింది. తెలుగుతోపాటు, అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మూవీ థియేటర్లలో విడుదలైన 4 వారాలకు ఓటీటీలో విడుదల చేయాల్సి ఉంది. అందుకే జూన్ 2 వ వారంలో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరి ఓటీటీలోకి అనుకున్న టైమ్ కే వస్తుందా..? లేక మరికొన్ని రోజులు ఆలస్యం అవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+