ఓటీటీలోకి సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల నటించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంలో సూర్యతో పాటు మలయాళం యంగ్ బ్యూటీ మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, భవాని శ్రీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి గతంలో సార్, లక్కీ భాస్కర్ లాంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు.
అటు సూర్య కూడా అంతకుముందు కరుప్పు సినిమాతో బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఇచ్చారు. దాంతో వీరిద్దరి కాంబోలో వస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాపై భారీగా అంచనాలు నెలకున్నాయి. అందుకు తగ్గట్లుగా ఫస్ట్ డే నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ దక్కింది. ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్, కామెడీ కలగలిపిన ఈ కథ ప్రేక్షకుల్ని అలరించింది. ఆగస్టు 14 న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ సాధించి సత్తా చాటింది.

అయితే థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు సెప్టెంబర్ 11 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో థియేటర్ లో మిస్ అయినవాళ్లు ఈ మూవీలో ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.












Click it and Unblock the Notifications
