స్టార్ హీరో భార్యకు మళ్లీ క్యాన్సర్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. భారత్ లోనూ క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా విజృంభిస్తోంది. పేద, ధనిక అని తేడా లేకుండా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ వ్యాధి ప్రబలుతోంది. అయితే ముందుగా గుర్తిస్తే ఈ వ్యాధికీ చికిత్స ఉంది. కానీ అవగాహన లోపంతో ప్రజలు ఈ వ్యాధి ముదిరే వరకూ చూస్తున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య, నటి తహీరా కశ్యప్ మరోసారి క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. దీనిపై ఆమె భర్త ఆయుష్మాన్ ఖురానాతో పాటు పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ఈ సారి కూడా ఈ వ్యాధి నుంచి బయటపడతావని ధైర్యం చెప్పారు.

ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ 2018లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే ఆమె ఈ వ్యాధిని జయించారు. తాజాగా మళ్లీ దాని బారిన పడినట్లు తహీరా కశ్యప్ స్వయంగా వెల్లడించారు. "ఏడేళ్ల నుంచి రెగ్యులర్ చెకప్‌లు, మెమోగ్రామ్‌లు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికీ చెబుతూ ఉంటా. ఇది నాకు రెండో రౌండ్. అయినా నేను మరొక యుద్ధానికి సిద్ధంగా ఉన్నా. ఈ వ్యాధితో పోరాడాలని నేను అనుకుంటున్నా. నాకు మళ్లీ క్యాన్సర్ వచ్చిందని చెప్పడానికి మొహమాటం ఏమీలేదు" అని తహీరా తన ఇన్ స్టా వేదికగా పేర్కొన్నారు.
ఇక భార్య తహీరా పోస్ట్ పై ఆయుష్మాన్ ఖురానా స్పందించారు. తహీరా క్యాన్సర్ ను కూడా గెలుస్తుందని, అందుకోసం ఆమెకు మరింత శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని అన్నారు. ఆయుష్మాన్ ఖురానాతో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇక ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల్లో నటించారు. బాలా, డ్రీమ్ గర్ల్, బదాయ్ హో, డ్రీమ్ గర్ల్ 2, విక్కీ డానర్, అంధదూన్, ఆర్టికల్ 15 లాంటి చిత్రాల్లో నటించారు.












Click it and Unblock the Notifications