విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత.. తమన్నా బంపరాఫర్!
Tamannaah Bhatia: సమంత, నాగచైతన్య విడిపోయి ఆ తర్వాత కెరీర్ పరంగా ఎలా పుంజుకున్నారో.. తాజాగా విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. తమన్నా ప్రస్తుం ఒక వెబ్ సిరీస్‌లో నటించడంతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో తమన్నా తన సినీ జీవితం, స్నేహాలు, బ్రేకప్, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడారు.
నటి తమన్నా ప్రస్తుతం తన కొత్త వెబ్ సిరీస్ 'డూ యూ వాన్న పార్ట్‌నర్' ప్రమోషన్లలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను జీవితంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో పంచుకున్నారు. "నేను ఓ మంచి లైఫ్ పార్ట్‌నర్‌గా మారడానికి ప్రయత్నిస్తున్నాను. అది ప్రస్తుతం నా లక్ష్యం. ఎవరి జీవితంలోకి నేను వెళ్తానో, ఆ వ్యక్తి నా గత జన్మలో నేను చేసిన మంచి కర్మల వల్ల ఆమె నాకు లభించింది' అని భావించేలా ఉండాలనుకుంటున్నానని తమన్నా చెప్పుకొచ్చారు. "ఆ అదృష్టవంతుడెవరో తెలియదు కానీ, నేను దాని కోసం కృషి చేస్తున్నాను. ఆ ప్యాకేజీ త్వరలో అందుబాటులోకి వస్తుంది" అని తమన్నా సరదాగా వ్యాఖ్యానించారు.

డయానా పెంటీతో కలిసి..
తమన్నా, డయానా పెంటీ కలిసి నటించిన 'డూ యూ వాన్నా పార్ట్‌నర్' సిరీస్ ఇద్దరు స్నేహితులు కలిసి ఒక వ్యాపారాన్ని ఎలా ప్రారంభించారు, అందులో ఎదురైన ఎత్తుపల్లాలను ఎలా అధిగమించారనే కథాంశంతో తెరకెక్కింది. ఈ సిరీస్ గురించి డయానా పెంటీ మాట్లాడుతూ, "నేను ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి వ్యాపారం చేయకూడదని అనుకునేదాన్ని. కానీ ఈ షో చేసిన తర్వాత, బెస్ట్ ఫ్రెండ్స్‌తో వ్యాపారం చేయడం చాలా సరదాగా ఉంటుందని అర్థమైంది. చాలా విషయాలు మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారి గురించి మనకు తెలుసు. దానివల్ల సమయం కూడా ఆదా అవుతుంది" అని డయానా పెంటీ అన్నారు.
మరోవైపు తన బెస్ట్ ఫ్రెండ్‌ని తనతో కలిసి వ్యాపారం చేయమని చాలాసార్లు అడిగినా ఆమె ఒప్పుకోలేదని తమన్నా భాటియా చెప్పారు. "నేను నా బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి మేకప్ బిజినెస్ చేద్దామని చెప్పాను, కానీ ఆమె పూర్తిగా నిరాకరించింది. అందుకే నా సొంత స్నేహితురాలినే ఒప్పించలేకపోయాను. కానీ ఇక్కడ నేను దేశమంతటిని మీ స్నేహితులతో వ్యాపారం చేయమని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను" అని తమన్నా నవ్వుతూ చెప్పారు.
ఫ్రెండ్‌షిప్ గురించి తమన్నా..
తమన్నా తన ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పారు. తన బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఫ్రెండ్స్ ప్రజ్ఞ, బిల్లీ కోసం టైమ్ ఎలా కేటాయించారో పంచుకున్నారు. "నేను ఒక పాట షూటింగ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ ప్రజ్ఞ, బిల్లీ నన్ను కలవడానికి సెట్‌కి వచ్చారు. నేను వారితో ఎక్కువ సేపు మాట్లాడలేనని వారికి తెలుసు. కానీ వారు కేవలం 15-20 నిమిషాలు నాతో గడపడానికి వచ్చారు. అది నా రోజును ప్రత్యేకంగా మార్చింది" అని తమన్నా అన్నారు.
డయానా పెంటీ కూడా స్నేహితుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. "నా స్నేహితులు ప్రశాంతంగా, డ్రామాలు లేకుండా, అహం లేకుండా ఉండాలి. తక్కువ మెయింటెనెన్స్ ఉన్న స్నేహితులు నాకు చాలా ఇష్టం. వారితో ఏమీ చేయకుండా కూర్చున్నా కూడా అది ఇబ్బందిగా అనిపించదు, దానిపై ఒత్తిడి ఉండదు" అని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications