మహేష్‌బాబుకు వార్నింగ్ ఇచ్చిన పొలిటీషియన్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేసినప్పటికీ ఎప్పుడూ హిందీవైపు చూడలేదు. ఎంతోమంది అగ్ర దర్శకులు, నిర్మాతలు హిందీలో చేయాలని, రూ.కోట్లలో పారితోషికం ఇస్తామంటూ ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆ అవకాశాలను సున్నితంగా తోసిపుచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తనను తాను మహేష్ బాబు ఈ సినిమా కోసం మలచుకుంటున్నాడు. మహేష్ బాబు పుట్టినరోజుకు దీనికి సంబంధించిన వార్త అధికారికంగా వచ్చే అవకాశం ఉంది.
కృష్ణ తర్వాత చెప్పేది అతనే
మొదటి నుంచి మహేష్ బాబు ఏ సినిమా చేసినా అది బాగుందా? లేదా? సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అని సరిగ్గా అంచనా వేసి చెప్పగలిగేది కేవలం ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఒక్కరే. ఆయన ఏది చెబితే అదే జరుగుతుంది. సినిమా ఆడుతుందంటే ఆడుతుంది.. ప్లాప్ అవుతుందంటే ఫ్లాప్ అవుతుంది. తన తండ్రి అంచనా ఎప్పుడూ తప్పలేదని మహేష్ బాబు ఎన్నోసార్లు, ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలాగే కృష్ణతోపాటు మరొక వ్యక్తి కూడా మహేష్ బాబు సినిమాలను చూస్తారు. ఆయన కూడా సినిమా చూసి బాగుందంటే బాగుందని, లేదంటే బాగోలేదని నిర్మొహమాటంగా చెబుతారు. సినిమా చూసి ఆయన ఏం చెబుతాడా? అనే టెన్షన్ తనకు ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో మహేష్ బాబు చెప్పారు.

మహేష్ బాబుకు మంచి స్నేహితుడు
ఇంతకీ ఆ రెండో వ్యక్తి ఎవరంటే సినిమా వ్యక్తి కాదు.. పొలిటీషియన్.. రాజకీయ నాయకుడు.. ఎవరో కాదు.. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. మహేష్ బాబుకు స్నేహితుడు. మహేష్ ప్రతి సినిమాను ఆయన చూసి బాగుందా? లేదా? అని చెప్పేస్తారు. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన ఆగడు సినిమా చూసిన కేటీఆర్ వెంటనే ప్రిన్స్ కు ఫోన్ చేసి ఇలాంటి చెత్త సినిమాలు చేయొద్దు.. చేస్తే బాగోదు అని నేరుగా వార్నింగ్ ఇచ్చారు.
కేటీఆర్ సినిమా చూశారు అంటే కచ్చితంగా తాను తీవ్ర ఒత్తిడి గురవుతానని, ఆగడు సినిమా చూసిన తర్వాత ఇటువంటి చెత్తసినిమాలు ఆపేయ్ అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారని మహేష్ బాబు చెప్పారు. తనకు ఎంతో మంచి స్నేహితుడని చెప్పారు. భరత్ అనే నేను సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు ఈ విషయాన్ని చెప్పారు. తాజాగా అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఆగడు సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.












Click it and Unblock the Notifications