చంద్రబాబు కోసం అల్లు అర్జున్, నాగార్జునకు భారీ షాక్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి
అల్లు అర్జున్ కు, అక్కినేని నాగార్జునకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి మహిళ మృతి, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసులో అరెస్ట్ చేయగా బెయిల్ పై బన్నీ బయట ఉన్నారు. అలాగే నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ద్వారా షాక్ ఇచ్చారు. తాజాగా వీరిద్దరికీ పరోక్షంగా మరో భారీ షాక్ ఇచ్చారు. అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా తండేల్ చిత్రం ముందస్తు విడుదల వేడుకను హైదరాబాద్ లో నిర్వహించడానికి గీతా ఆర్ట్స్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే దీనికి పోలీసులు చివరి నిముషంలో అనుమతి నిరాకరించారు.
బాలయ్యకు పద్మభూషణ్ పై పార్టీ ఇస్తున్నారు
యువ కథానాయకుడు నాగచైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా గీతా ఆర్ట్స్ బ్యానరుపై భారీ బడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియా చిత్రం తండేల్. ఈ సినిమా ఈనెల ఏడోతేదీన విడుదల కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా ముందస్తు విడుదల వేడుక నిర్వహించాలని భావించగా చిత్ర యూనిట్ కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు, పలువురు సెలబ్రిటీలకు వారి సొంత ఫామ్ హౌస్ లో పార్టీ ఇస్తున్నారు. దీనికి భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తండేల్ సినిమాకు పోలీసులను కేటాయించడం కుదరదని చెప్పడంతో, తండేల్ వేడుకను రెండోతేదీకి వాయిదా వేశారు.

భారీగా అభిమానులు తరలివస్తే..
ఒకేసారి రెండు వేడుకలకు పోలీసులను సర్దుబాటు చేయడం కుదరదని, చాలా కష్టమని పోలీసులు చెప్పారు. దీంతో తండేల్ జాతరను ఆదివారానికి వాయిదా వేస్తున్నామని, వేడుక భారీగా ఉంటుందని, ఈపాలి యాట గురి తప్పేదే లేదేస్ అంటూ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. వేడుక ఎక్కడ జరుగుతుందనేది ఇంకా ప్రకటించలేదు. వేడుకకు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా వస్తుండటంతో అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, జైలుకు వెళ్లివచ్చిన తర్వాత హాజరవుతున్న మొదటి బహిరంగ వేడుక కావడంతో అభిమానులను అదుపు చేయడం కష్టమవుతుందనే ఉద్దేశంతో దీన్ని నిరాకరించినట్లు తెలుస్తోంది. రేపు జరిగే వేడుకకు మాత్రం పోలీసులను భారీగా మొహరించి ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడనున్నారు.












Click it and Unblock the Notifications