ముసలి హీరోలతో నటించనని చెప్పా - తెలుగు హీరోయిన్ సంచలనం
నేటితరం హీరోయిన్లు తమకున్న తక్కువ సమయంలోనే వీలైనన్ని సినిమాలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతుంది బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్.బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.
స్నేహం అంటే ఇదేరా అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. గంగోత్రి, బాలు, ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉన్నత చదువుల కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ గతేడాది హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

సస్పెన్స్, థ్రిల్లర్ 'మసూద' సినిమాలో లీడ్ రోల్‌లో నటించి మెప్పించింది. హారర్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమా కావ్య కళ్యాణ్ రామ్‌కు తొలి హిట్ అందించింది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'బలగం' సినిమాతో మరో సూపర్ హిట్‌ను కావ్య కళ్యాణ్ తన ఖాతాలో వేసుకుంది. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న కావ్య కళ్యాణ్, ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించింది.
దీనిపై ఓ ఇంటర్య్వూలో స్పందిస్తూ..ముసలి హీరోల పక్కన యాక్ట్ చెయ్యను అని కావ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా దీనిపై స్పందిస్తూ..ముసలి హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని, కానీ వారితో సినిమాలు చేయనని చెప్పేశానని చెప్పి సంచలనం సృష్టించింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చింది ఈ బ్యూటీ. అల్లు అర్జున్, బాలయ్య సినిమాలలో బాలనటిగా నటిస్తున్నప్పుడు, పెద్దయ్యాక తమ పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేయమని సరదాగా అడిగేవారని చెప్పింది. అయితే చిన్నతనంలో ఏదో తెలియక ముసలి వాళ్ళతో యాక్ట్ చేయనని అన్నానని చెప్పింది.












Click it and Unblock the Notifications