రిలీజైన 24 గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బ్లాస్టర్ సినిమా
ఇటీవల కాలంలో ఓటీటీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధారణ లభిస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు , చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కంటెంట్ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు పరభాష సినిమాను సైతం నెత్తిన పెట్టుకుంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఓ సినిమా సందడి చేయడానికి రెడీ అవుతోంది. విచిత్రం ఏమిటంటే..ఈ సినిమా విడుదలైన ఒక్క రోజులోనే ఓటీటీలో ప్రత్యక్షం కానుంది.
ఆ సినిమా మరెదో కాదు..'డీఎన్ఏ'.ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ ఫేం అధర్వ మురళి హీరోగా నటించగా, నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటించారు. తమిళంలో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాను తెలుగులో 'మై బేబీ' అనే టైటిల్‌తో డబ్ చేస్తున్నారు నిర్మాతలు.జులై 18న తెలుగులో 'మై బేబీ' పేరుతో థియేటర్లలో విడుదల కావాల్సిన 'డీఎన్ఏ' సినిమా, జులై 19 నుంచే డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ పరిణామం తెలుగు వెర్షన్ థియేట్రికల్ రిలీజ్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సాధారణంగా ఓటీటీ రిలీజ్ డేట్ చాలా ముందుగానే ప్రకటిస్తారు. కానీ ఇప్పుడు థియేటర్ రిలీజ్ అయిన కేవలం ఒక్కరోజుకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓటీటీ సంస్థ సడన్‌గా ఈ నిర్ణయం తీసుకుందా లేక థియేటర్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నవారికి ఈ ఓటీటీ డేట్ గురించి అవగాహన లేదా అనేది స్పష్టంగా తెలియట్లేదు.
'డీఎన్ఏ' కథ:
ఆనంద్ (అధర్వ మురళి) ప్రేమ విఫలమవడంతో తాగుబోతుగా మారతాడు. ఆ తర్వాత బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న దివ్య (నిమిషా సజయన్)ను పెళ్లి చేసుకుంటాడు. ఆనంద్‌లో మార్పు వచ్చి భార్యతో సంతోషంగా జీవిస్తుంటాడు. దివ్య గర్భవతి అవుతుంది. ప్రసవం తర్వాత తన బిడ్డ మారిపోయిందని దివ్య ఆసుపత్రిలో వాదిస్తుంది. అసలు దివ్య చెప్పింది నిజమేనా? బిడ్డ దొరికిందా లేదా అనేది మిగతా కథ. ఈ చిత్రం 2014లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.












Click it and Unblock the Notifications