మెగా హీరోల దెబ్బకు బేజారెత్తుతున్న OTTలు
ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మెగా హీరోలు నటిస్తున్న సినిమాలు అభిమానులను, ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. పరాయి భాషలో హిట్ అయిన సినిమాలను వీరు తెలుగులో తెరకెక్కిస్తున్నారు. అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేక ఘోరమైన డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. భోళాశంకర్, బ్రో, గాండీవధారి అర్జు లాంటి సినిమాలతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా నష్టపోయారు. భీమ్లానాయక్ కూడా బ్రేక్ ఈవెన్ అందుకున్న దాఖలాలు లేవని చెబుతారు.
భోళాశంకర్ పై పునరాలోచన
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా పోయింది. అన్ని భాషల్లో సబ్ టైటిల్స్ వస్తుండటంతో పాటు డబ్బింగ్ చేసి ప్లే చేయడంలాంటివి చేస్తుండటంతో తెలుగు ప్రజలు భాషతో సంబంధం లేకుండా విరివిగా సినిమాలు చూస్తున్నారు. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా తమిళ వేదాళం రీమేకే. తెలుగులో ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. అయినా దీనిపై ఎటువంటి బజ్ క్రియేటవకపోతుండటంతో సంస్థ పునరాలోచనలో పడింది.

నష్టాల బాటలో ఓటీటీలు
పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటించిన బ్రో మూవీ కూడా రీమేక్ సినిమానే. దీని మాతృక వినోదయ సీతం సినిమా అన్ని భాషల్లో, అన్ని ప్లాట్ ఫారాల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఒరిజినల్ సినిమా చూసిన తర్వాత దాన్ని రీమేక్ చేసినా చూసి జీర్ణించుకోవడం కష్టమవుతుంది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కూడా అదే భావనలో ఉన్నారు. అగ్ర హీరోల చిత్రాలని భారీ ధరపెట్టి కొనుగోలు చేయడం, వాటికి వ్యూస్ లేక దారుణంగా నష్టాల పాలవడం ఓటీటీ సంస్థల వంతవుతోంది.

చిన్న సినిమాలే వెయిరెట్లు నయం
దీంతో అగ్ర హీరోల సినిమాల కొనుగోలుకు ముందుకు రావడంలేదు. ధర వెచ్చించే ముదు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన సినిమాలు నష్టాలను తెస్తుండటంతో వీటికన్నా చిన్న సినిమాలుగా విడుదలై సంచలన విజయాలు అందుకున్న సినిమాలకే ఒక రూపాయి ఎక్కువిచ్చి కొంటే లాభాలు వస్తాయని ఓటీటీ సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వరుసబెట్టి ఫ్లాప్ సినిమాలు అందిస్తున్న మెగా హీరోల దెబ్బకు ఓటీటీలు కూడా కుదేలవుతున్నాయనే టాక్ వినపడుతోంది. తర్వాత సినిమాలన్నా విజయం సాధిస్తాయా? లేదా? అనేది మెగా హీరోలకు, అభిమానులకే తెలియాలి.












Click it and Unblock the Notifications