హఠాత్తుగా నిశ్చితార్థం జరుపుకున్న తెలుగు స్టార్ హీరోయిన్

మేఘా ఆకాష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. నితిన్ సరసన లై సినిమాలో నటించి తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తన మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత చల్ మోహన్ రంగ, మనుచరిత్ర, రాజరాజచోర, ప్రేమదేశం, రావణాసుర, డియర్ మేఘ, గుర్తుందా శీతాకాం లాంటి సినిమాల్లో తన అభినయంతో ఆకట్టుకుంది. వీటి తర్వాత తమిళంలోను వరుసగా అవకాశాలు వచ్చాయి. గతేడాది ఏకంగా మూడు తమిళ సినిమాల్లో నటించింది.

తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో ప్రేమలో ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మేఘా ఆకాష్ స్పందించలేదు. తాజాగా ఈ బ్యూటీ పెళ్లివార్తలను నిజం చేస్తూ నిశ్చితార్థం జరుపుకుంది. సాయి విష్ణు అనే వ్యక్తితో మేఘాకు ఎంగేజ్ మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈనెల 22వ తేదీన ఈ వేడుక జరిగింది. దీనిపై నెటిజన్లు మేఘాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న మేఘా ఆకాష్ కు నిశ్చితార్థం జరిగిందని తెలియగానే రెండు రాష్ట్రాల్లోని కుర్రకారు గుండె బద్దలైంది. చెన్నైలో పుట్టిన మేఘా మహిళా క్రిస్టియన్ కాలేజ్ లో చదువుకుంది.

telugu young heroine megha akash engagement with sai vishnu

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న హీరోయిన్లంతా వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈనెల ఎనిమిదో తేదీన శోభిత ధూళిపాళ.. అక్కినేని నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకుంది. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. హఠాత్తుగా వీరిద్దరికీ నిశ్చితార్థం జరగడంతో ఫిలింనగర్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఆరునెలల తర్వాత వీరి వివాహం జరగబోతోంది. ప్యారిస్ లో చేయాలనే యోచనలో నాగచైతన్య కుటుంబ సభ్యులున్నారు. దేశంలో కూడా వేదికలను వెదుకుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+