ప్రభాస్ "రాజాసాబ్" పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే !

పాన్ ఇండియా స్టార్ "ప్రభాస్" నటించిన తొలి హారర్ చిత్రం "ది రాజాసాబ్". మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, బోమన్ ఇరానీ ముఖ్యపాత్రల్లో కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు.

భారీ అంచనాలతో జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఓ వర్గం వింటేజ్ ప్రభాస్ ని మళ్లీ చూసే ఛాన్స్ వచ్చిందని ఖుషి అవుతుంటే.. మరో వర్గం మాత్రం ఆశించిన స్థాయిలో లేదంటూ అంటున్నారు. దీంతో మొత్తానికి అనుకున్నంత రేంజ్ లో మాత్రం మూవీ హిట్ కొట్టలేకపోయింది.

thammareddy-bharadwaj-shocking-comments-on-prabhas-rajasaab-movie-failure-and-budget-for-story-chang

కాగా ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాపై సీనియర్ డైరెక్టర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజాసాబ్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఇవే అంటూ ఓపెన్ అయ్యారు. దాంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం రూ.100 కోట్లతో రీజినల్ ఫిల్మ్‌గా తీసుంటే లాభాలు వచ్చేవని.. పాన్ ఇండియా ప్రాజెక్టుగా మారడం వల్లే మూవీ ఫెయిల్ అయిందnఈ వ్యాఖ్యానించారు.

ఇంకా ఏమన్నారంటే..?

తమ్మారెడ్డి ఇంకా మాట్లాడుతూ.. నేను విన్నదేంటి అంటే, పాన్ ఇండియా సినిమాల మధ్యలో ప్రభాస్ ఒక చిన్న సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. మంచి ఎంటర్టైన్ మెంట్ ను ఇచ్చే సినిమాలు తీయడంలో మారుతికి మంచి పేరు ఉందని ఆయనతో చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ముందుగా సినిమాను ఎలా తీయాలని అనుకున్నారో.. అలాగే తీసి ఉంటే బాగుండేది. కానీ ఆ తరువాత పాన్ ఇండియా టచ్ ఇవ్వడానికి ట్రై చేయడమే కథ దెబ్బతినడానికి కారణమని అనుకుంటున్నాను అని అన్నారు.

అంతే కాకుండా కేవలం రూ.100 కోట్లతో రీజినల్ ఫిల్మ్‌గా తీసుంటే లాభాలు వచ్చేవని అభిప్రాయపడ్డారు. రాజమౌళి చేశారని చెప్పి అందరూ పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకోవడం కరెక్టు కాదని తెలిపారు. రాజమౌళి రెమ్యునరేషన్స్ పై కంటే కథపై పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటుందని.. మిగతా వాళ్లు మాత్రం 80 శాతం రెమ్యునరేషన్స్ పై.. 20 శాతమే కథపై ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అందుకే ఇలా దెబ్బ తింటున్నారని.. అందరి కోసం అనుకుని తీసిన సినిమాలు సరిగ్గా ఆడటం లేదని వివరించారు. ఈ రోజుల్లో నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు తప్ప, గుర్తుండిపోయే సినిమాలు తీయడం మర్చిపోతున్నారని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.

thammareddy-bharadwaj-shocking-comments-on-prabhas-rajasaab-movie-failure-and-budget-for-story-chang

ఇక మరోవైపు దర్శకుడు మారుతి ఈ సినిమా పరాజయంపై స్పందిస్తూ ప్రేక్షకులే కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. పండుగ సమయంలో ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాలోని లోతైన కథను అర్థం చేసుకోలేకపోయారని అన్నారు. కేవలం వినోదాన్ని ఆశించి రావడం వల్ల సినిమా అసలు కథ వారికి కనెక్ట్ కాలేదని ఓ ఇంటర్వ్యూలో మారుతి చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+