అక్కినేని విధ్వంసం ఇలా ఉంటుందా..!
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. అంచనాలను మించి విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద దూకుడును ప్రదర్శిస్తోంది.ముఖ్యంగా నాగ చైతన్య నటన అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. దేశభక్తి ఎలిమెంట్స్‌తో అందమైన ప్రేమకథను చూపించారని అంటున్నారు. సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ పోటీపడి మరీ నటించారు.సినిమా అంతా ఒక ఎత్తు అయితే, చివరి 20 నిమిషాల సినిమాను దర్శకుడు మరో లేవల్‌కు తీసుకువెళ్లారు.
క్లైమాక్స్‌లో నాగ చైతన్య నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.చందు మొండేటి సినిమాను తన దర్వకత్వంతో కట్టిపడేశాడు.ఇదింతా ఒక ఎత్తు అయితే, దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం మరో ఎత్తు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. పాటలతో పాటు, నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. మరోవైపు కలెక్షన్లలో కూడా 'తండేల్' సత్తా చాటుతోంది.'తండేల్' సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది.

41.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ "బ్లాక్ బస్టర్ లవ్ సునామీ" అంటూ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.ఆదివారంతో ఈ సినిమా రూ. కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఓవర్సీస్‌లో 500K డాలర్స్‌కుపైగా వసూలు అయినట్లు మూవీ టీమ్ తెలిపింది. తండేల్ సినిమా రూ.100 కోట్లు సాధింస్తుందని చిత్ర యూనిట్ మొదటి నుంచి కూడా నమ్మకంగా ఉంది. ఇప్పుడు కలెక్షన్లను చూస్తుంటే ఇది సాధ్య అయ్యేలాగే కనిపిస్తోంది. ఇప్పట్లో మరే పెద్ద సినిమా లేకపోవడంతో తండేల్ రూ.100 కోట్లు చేరడం ఖాయమని అక్కినేని అభిమానులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications