థియేటర్‌లో ఒక్కరోజు మాత్రమే ఆడిన అతి పెద్ద స్టార్ హీరో సినిమా

గతంలో సినిమాలు విడుదలైతే థియేటర్లలో ఎక్కువరోజులు ఆడేవి. అందుకు కారణం తక్కువ థియేటర్లలో విడుదల చేసేవారు. కాలం మారడంతో నిర్మాతలంతా మొదటి వారం రోజుల్లోనే సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి రెండువారాల్లో ఆ సినిమాను సినీ ప్రియులంతా చూసేస్తుండటంతో క్రమేణా అర్థ శతదినోత్సవాలు, శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీల్లాంటివన్నీ మాయమయ్యాయి. ఈ క్రమంలో భారతదేశంలో అతి పెద్ద స్టార్ హీరోగా చెలామణి అవుతున్న హీరో సినిమా తనకు అచ్చివచ్చిన థియేటర్ లో కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే ఆడి అభిమానులందరికీ తీవ్ర షాక్ ఇచ్చింది.

మరాఠా మందిర్ లో తీసేశారు
ఆ హీరో ఎవరో కాదు.. షారుక్ ఖాన్. ఆయన నటించిన డంకీ సినిమా 2023 డిసెంబరు 21న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన ఒకరోజు తర్వాత పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ విడుదలైంది. షారుక్ నటించిన దిల్ వాలే దుల్జనియా లేజాయేంగే సినిమా ముంబయిలోని మరాఠా మందిర్ లో ఏకధాటిగా 28 సంవత్సరాలు ప్రదర్శితమైంది. కొన్నాళ్ల తర్వాత మార్నింగ్ షోతో ఈ సినిమాను థియేటర్ నుంచి తీసేయకుండా నడిపించుకుంటూ వచ్చారు. మిగతా మూడు షోలు మరో సినిమా వేసేవారు. డంకీ సినిమా విడుదలైన తర్వాత మరాఠా మందిర్ లో కేవలం ఒకరోజు మాత్రమే ప్రదర్శించి తీసేశారు. అందుకు కారణం.. తర్వాత రోజు విడుదలవుతున్న సలార్ సినిమా.

The biggest star hero movie that played in theaters for only one day

మొదటి స్థానంలో నిలుస్తున్న ప్రభాస్
సలార్ ను ప్రదర్శించడం కోసం డంకీని తీసేయడం సినీవర్గాలందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ థియేటర్ షారుక్ ఖాన్ కు చాలా సెంటిమెంట్. కానీ యాజమాన్యం మాత్రం సలార్ ను ప్రదర్శించడానికి ఆసక్తి చూపడంతో షారుక్ ఖాన్ మీద ప్రభాస్ ఆధిపత్యం సంపాదించాడని, క్రేజ్ పెంచుకున్నాడని డార్లింగ్ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా హీరోల జాబితాలో మొదటి స్థానంలో ప్రభాస్ ఒక్కడే ఉంటున్నాడు. మిగతా హీరోలంతా తర్వాత స్థానాల్లోనే నిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+