స్టార్ హీరోకు ఇంటి భోజనం, బెడ్ కు బ్రేక్, తీర్పు రిజర్వు చేసిన కోర్టు, అసలే చలికాలం

రేణుకాస్వామి హత్య కేసులో జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు ఇంటి భోజనం పెట్టాలని దాఖలైన పిటిషన్‌ను విచారించి వాదనలు విన్న న్యాయమూర్తి జూన్ 25వ తేదీకి తీర్పు రిజర్వ్ చేశారు. శ్యాండిల్ వుడ్ ఛాలెజింగ్ హీరో

దర్శన్, నటి పవిత్ర గౌడ అండ్ గ్యాంగ్ రేణుకస్వామిని హత్య చేశారని నమోదు అయిన కేసులో జైలుకెళ్లిన విషయం తెలిసిందే.

కన్నడ నటుడు దర్శన్‌ తనకు ఇంటి భోజనం, పడుకోవడానికి బెడ్, చదువుకోవడానికి బుక్ లు ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ బెంగళూరులోని 24వ ఏసీఎంఎం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి నటుడు దర్శన్‌ తరఫున న్యాయవాది రాఘవేంద్ర వాదనలు విన్నారు. జైలులో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీలు ఇంటి నుండి ఆహారం, బట్టలు, పడకను పొందటానికి అనుమతిస్తారని దర్శన్ న్యాయవాది కోర్టుకు చెప్పారు.

The court reserved the verdict on the petition filed for home meal for Hero Darshan

వారు తమకు కావలసినవి కావాలని మనవి చేస్తే అందుకు అనుమతి ఇచ్చే అవకాశం జైలు ఐజీపీకి ఉందని దర్శన్ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇంటి నుంచి ఆహారం, దుస్తులు, పడకలను బయట నుంచి అనుమతించే అధికారం ఐజీపీ ఇచ్చారు, ఖైదీలు వారి సౌకర్యాలను వినియోగించుకోలేనప్పుడు మాత్రమే జైలులోని సౌకర్యాలను పొందాలని చట్టంలో ఉందని దర్శన్ న్యాయవాది కోర్టుకు చెప్పారు. విచారణ ఖైదీలు ఇంటి నుండి ఆహారం పొందేందుకు అనుమతి ఉంది.

అయితే, శిక్షకు గురి అయినప్పుడు మాత్రమే ఖైదీలు ఇంటి ఆహారాన్ని తినడానికి అవకాశం లేదని దర్శన్ న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇప్పుడు విచారణ ఖైదీ సినిమా నటుడు, సినిమా హీరో. మీడియా ఈ కేసును రాద్దాంతం చేస్తోందని, దీంతో జైలు అధికారులు దర్శన్ కు ఇంటి నుంచి తెచ్చిన ఆహారం, ఇతర వస్తువులను బయటి నుంచి తెచ్చేందుకు అనుమతించలేదని హీరో దర్శన్ న్యాయవాది కోర్టుకు చెప్పారు.

హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి కూడా ఇంటి భోజనం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారని, అయితే దర్శన్ భార్య ఇచ్చిన లేఖకు అధికారులు ఎండార్స్‌మెంట్ కూడా ఇవ్వలేదని దర్శన్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. జైలులో ఉన్న నిందితులు ఇంటి భోజనం చేయనివ్వకపోతే అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ వారికి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని జీవించే హక్కు కల్పించిందని, దర్శన్‌కు సినిమా స్టార్‌ కావడం వల్లనే ఆయనకు వ్యతరేకంగా బయట ప్రతికూల ప్రచారం జరుగుతోందని, దీంతో విచారణ ఖైదీ అయిన తన క్లైంట్ కు అందాల్సిన సౌకర్యాలు జైలులో అందడం లేదని దర్శన్ న్యాయవాది రాఘవేంద్ర కోర్టులో వాదించారు. వాదనలు పూర్తి కావడంతో కోర్టు తీర్పును వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+