రీరిలీజ్‌లో రూ.కోట్లు కొల్లగొట్టి తెలుగులో నెంబర్‌వన్‌గా నిలిచిన సినిమా
గతంలో హిట్ అయిన, సూపర్ హిట్ అయిన, బ్లాక్ బస్టర్ అయిన హీరోల సినిమాలను తిరిగి విడుదల చేయడం అనేది ప్రస్తుతం ఒక ట్రెండ్ గా మారింది. కాలంతోపాటు సాంకేతికతలో నూతన మార్పులు చోటుచేసుకోవడంతో తమ హీరోల పాత సినిమాలను కొత్త సాంకేతికతతో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకనుగుణంగా నిర్మాతలు 8కె రిజల్యూషన్, డాల్బీ అట్మాస్ లాంటి హంగులు జోడించి విడుదల చేస్తున్నారు. దాదాపుగా ప్రతి హీరో సినిమా ఇలా విడుదలవుతూనే ఉంది. అభిమానుల కోరిక మేరకు విడుదలవుతున్నప్పటికీ రీరిలీజ్ లో కూడా రికార్డులు సృష్టిస్తూ కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాలున్నాయి.
మురారి, గబ్బర్ సింగ్, సింహాద్రి
ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి, పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్, జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రితోపాటు బాలయ్య సమరసింహారెడ్డితోపాటు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రామ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ.. తదితర హీరోల సినిమాలన్నీ తిరిగి విడుదలవుతున్నాయి. వీటిల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టి సంచలన రికార్డును కైవసం చేసుకున్నారు మహష బాబు. ఆయన నటించిన మురారి సినిమా రీరిలీజ్ లో రూ.9 కోట్లు కొల్లగొట్టింది. తర్వాత స్థానంలో రూ.8 కోట్లతో గబ్బర్ సింగ్, రూ.5 కోట్లతో సింహాద్రి నిలిచాయి.

తెలుగువారంతా సినీ ప్రియులు
తిరిగి థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలను కూడా ఆదరించే గుణం ఒక్క తెలుగువారిలోనే ఉందని గతంలో రవితేజ ప్రకటించారు. తెలుగువారంతా సినీప్రియులనే సంగతి తెలిసిందే.కథ, నటన, యాక్షన్ సన్నివేశాలు నచ్చితే హీరో ఎవరు అనదాంతో సంబంధం లేకుండా సినిమాను బ్లాక్ బస్టర చేయడమే కాదు.. ఇండస్ట్రీ హిట్ కూడా చేస్తారు. తెలుగువారికి సినిమాపై ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ కలెక్షన్లు. తమిళంలో తిరిగి విడుదలైన గిల్లి సినిమా రూ.32 కోట్లు రాబట్టింది. విజయ్, త్రిష నటించారు. తెలుగులో వచ్చిన ఒక్కడు సినిమాకు ఇది రీమేక్. దేశవ్యాప్తంగా రీరిలీజ్ లో హిందీ సినిమా తుంబాడ్ అత్యధికంగా రూ.37 కోట్లు రాబట్టి ప్రథమ స్థానంలో నిలిచింది.












Click it and Unblock the Notifications